చెర్రీ అండ్ బోయపాటి.. అలా మొదలైంది

Fri Nov 24 2017 18:57:37 GMT+0530 (IST)

కొన్ని రోజులుగా రామ్ చరణ్ మరుసటి చిత్రం పై చాలానే అంచనాలు వినిపిస్తున్నాయి. కొరటాల శివతో ఓ సినిమా..  బోయపాటి తో మరో చిత్రం యాక్సెప్ట్ చేశాడనే టాక్ ఉండగా.. మధ్యలో రాజమౌళి ప్రాజెక్టు గురించి కూడా అంచనాలు వినిపించాయి.ఇలాంటి  సమయంలో.. మెగా పవర్ స్టార్ మరుసటి చిత్రం పై అభిమానుల్లో చాలానే డౌట్స్ మొదలయ్యాయి. వీటిన్నిటికీ ఇప్పుడు రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేశాడు. నేరుగా పూజా కార్యక్రమాలు చేసేసి.. తన తర్వాతి సినిమా పై పూర్తి స్పష్టత ఇచ్చాడు చెర్రీ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ తన తర్వాతి సినిమా చేయనున్నాడు. రీసెంట్ గా హైద్రాబాద్ లో ఈ మూవీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి అధికారికంగా మొదలుపెట్టేశారు. బోయపాటి- చరణ్ కాంబినేషన్ లో రూపొందే సినిమా రెగ్యులర్ షూటింగ్.. వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి ఆరంభం అయ్యే అవకాశాలున్నాయి.

డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులు.. సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం సుకుమార్ తో రంగస్థలం మూవీ చేస్తున్న చెర్రీ.. ఈ మూవీ షూటింగ్ ఫినిష్ కాగానే.. బోయపాటి మూవీని స్టార్ట్ చేస్తాడు.