Begin typing your search above and press return to search.

బ్రూస్‌ లీ.. లుంగి డాన్స్ కూడా వేశాడు

By:  Tupaki Desk   |   7 Oct 2015 5:54 AM GMT
బ్రూస్‌ లీ.. లుంగి డాన్స్ కూడా వేశాడు
X
బాద్ షా షారూక్‌ ఖాన్ అంత‌టివాడే లుంగీ చూసి ప‌రేషాన్ అయిపోయాడు. లుంగీ క‌ట్టాల్సిందే.. లుంగీ డ్యాన్స్ చేయాల్సిందే.. అని ఫిక్స‌యి చెన్న‌య్ ఎక్స్‌ ప్రెస్‌ లో లుంగి డాన్స్ లుంగి డాన్స్ అంటూ మ‌జాక్ చేశాడు. అది చెన్న‌య్ తంబీల‌కు విప‌రీతంగా న‌చ్చేసింది. అందుకే చెన్న‌య్ ఎక్స్‌ ప్రెస్ త‌మిళ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. అయితే ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప్ర‌తి సినిమాలో లుంగి డాన్స్ పేర‌డీలు బోలెడన్ని వ‌చ్చాయి. ఇప్ప‌టికీ ఆ లుంగీ డ్యాన్స్ ప్ర‌భావం త‌గ్గిపోయిందే లేదు.

క‌ట్ చేస్తే అస‌లు లుంగీ డ్యాన్స్ కేవ‌లం చెన్న‌య్ ఎక్స్‌ ప్రెస్ నుంచే కాదు .. మ‌న మెగా స్టార్ చిరంజీవి ఆరోజుల్లోనే ముఠా మేస్ర్తి సినిమాలో ఓ రేంజులో చూపించాడు. హోయి ర‌బ్బ హోయి ర‌బ్బ హోయిర‌బ్బా .. అంటే ఇర‌గ‌దీశాడు. ఇప్ప‌టికీ ఆ సాంగ్‌, మెగాస్టార్ నిక్క‌రుపైన లుంగీ బిగించి వేసిన స్టెప్స్ సెన్సేష‌నే. ఇప్పుడు అదే తీరుగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ లుంగీ అవ‌తార్ లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. బ్రూస్‌లీ టైటిల్ సాంగ్‌లో చ‌ర‌ణ్ లుంగీ డ్యాన్స్ చేయ‌నున్నాడు. అయితే అది మ‌రోసారి ముఠామేస్ర్తి బిట్‌ని ప‌రిచయం చేస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

ఇప్పటికే షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకున్న బ్రూస్‌ లీ.. మరో రెండు రోజుల్లో సెన్సార్‌ కు వెళ్లనుందట. అక్టోబర్‌ 16న రిలీజ్‌ చేయడానికి ఏర్పాట్లన్నీ సాగుతున్నాయి.