Begin typing your search above and press return to search.

చెర్రీ లుక్ ఛేంజ్ అవుతోందిగా!!

By:  Tupaki Desk   |   23 Feb 2018 8:51 AM GMT
చెర్రీ లుక్ ఛేంజ్ అవుతోందిగా!!
X
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. ఇంకా గుమ్మడికాయ కబుర్లు వినిపించలేదు కానీ.. ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించి ప్యాచ్ వర్క్ కూడా పూర్తయిపోయిందట. అందుకే మెల్లగా తన లుక్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు చెర్రీ.

చిట్టిబాబు పాత్ర కోసం చాలా కాలంగా సేమ్ లుక్ ను కంటిన్యూ చేస్తూ.. పల్లెటూరి మొనగాడి మాదిరిగా కనిపించిన రామ్ చరణ్.. ఇప్పుడు మళ్లీ మేకోవర్ వైపు వచ్చేస్తున్నాడు. రీసెంట్ గా రామ్ చరణ్ కనిపించినపుడు ఫ్యాన్స్ ఫోటోలు తీసి నెట్ లో పోస్ట్ చేసిన పిక్చర్స్ ను చూస్తే.. ఈ విషయం అర్ధమవుతుంది. అయితే.. ఇంకా గెడ్డం లుక్ ను వదిలిపెట్టలేదు కానీ.. హెయిర్ స్టైలింగ్ విషయంలో మాత్రం మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కే మాస్ ఎంటర్టెయినర్ షూటింగ్ ప్రారంభమైపోయింది. ఈ చిత్రం కోసం చరణ్ తప్పనిసరిగా లుక్ మార్చుకోవాల్సి ఉంది.

పక్కా మాస్ సినిమాలను అద్భుతంగా రూపొందించే బోయపాటి.. మెగా పవర్ స్టార్ ను ఎలా చూపబోతున్నాడనే ఆసక్తి కనిపిస్తోంది. అయితే.. ఇంకొంత కాలం పాటు.. అంటే రంగస్థలం ప్రీరిలీజ్ ఈవెంట్ వరకూ చిట్టిబాబు మాదిరిగా గెడ్డం లుక్ లో చరణ్ ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అలా అయితే మాత్రం.. బోయపాటి షూటింగ్ కు చరణ్ అటెండ్ అయేందుకు ఇంకా నాలుగు వారాలు పట్టేయచ్చు.