చరణ్ మీసం అల్లూరిలా ఉందా?

Fri Mar 15 2019 09:48:16 GMT+0530 (IST)

నిన్న ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ని కొత్త మీసకట్టులో చూశాక అందరికి వచ్చిన అనుమానం ఇదే. సోషల్ మీడియాలో ఇటీవలే పాక్ చెరనుంచి బయటికి వచ్చిన అభినందన్ లా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేశారు. మనకు అల్లూరి సీతారామరాజు అంటే ప్రతి ఒక్కరికి ఆయన రూపం కృష్ణ గారి సినిమాలో చూపించిన తరహాలో మనసులో ప్రింట్ అయిపోయింది. ఒరిజినల్ ఫోటోల్లో కూడా ఆయన అలాగే ఉన్నారన్న ఆధారాలు ఉన్నాయి.కానీ చరణ్ మీసం మాత్రం పెదవుల పక్కగా గెడ్డానికి రెండు వైపులా కిందికి పెట్టడం చూసి మీడియా కూడా ఆశ్చర్యపోయింది. అయితే రాజమౌళి చెబుతున్న పాయింట్ ప్రకారం ఇది అల్లూరిగా మారకముందు రామరాజు గెటప్ అని. కానీ కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజులో ఆయన యవ్వనానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటిలో మాములు గెటప్ లోనే ఉంటారు

కానీ ఇక్కడే ఓక ట్విస్ట్ ఉంది. ఇది సినిమాలో మనం చూడబోయే మీసకట్టు కాదట. కావాలనే ఇలా షేప్ చేయించి ప్రెస్ మీట్ కోసం మేనేజ్ చేశారు తప్ప ఒరిజినల్ వేరే ఉంటుందని టాక్. ఎంతైనా రాజమౌళి ప్లానింగ్ వేరు. ఫస్ట్ లుక్ ని ఇలా ప్రెస్ మీట్ లో ఎలా బయటపెట్టేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ వేషం కూడా ఏదో సర్ ప్రైజ్ ఉంటుందట.

మొత్తానికి మీసాల మాయాజాలంతో పాటు టోపీలు పెట్టించి ఆనవాళ్లు తెలియకుండా జాగ్రత్త పడిన జక్కన్న మరో ఆరు నెలల దాకా మీడియా ముందు వచ్చే ఛాన్స్ లేదు. అందుకే ఓపిగ్గా గంటకు పైగా ప్రత్యేకంగా తెలుగు మీడియాతో చర్చించాడు. మొత్తానికి నిన్న జరిగిన ప్రెస్ మీట్ అంచనాలు పెంచడంలో విజయవంతమయ్యింది.