Begin typing your search above and press return to search.

చరణ్‌ హోటల్లో మహేష్‌ డబ్బులు??

By:  Tupaki Desk   |   23 Jan 2017 1:52 PM GMT
చరణ్‌ హోటల్లో మహేష్‌ డబ్బులు??
X
టాలీవుడ్ లో రోజుకో కొత్త న్యూస్ వినిపిస్తూనే ఉంది. అలాంటి వాటిలో ఒకటి.. కొత్తగా చిగురించిన రామ్ చరణ్‌ అండ్ మహేష్‌ బాబుల స్నేహం అనే చెప్పాలి. గత రాత్రి నమ్రతా శిరోద్కర్ బర్త్ డే వేడుకల్లో మన చరణ్‌ అండ్ ఉపాసన సెంటర్ ఆఫ్‌ ఎట్రాక్షన్ అనే సంగతి కూడా తెలిసిందే. ఈ సందర్బంగా ఇంకో ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి టాలీవుడ్ లో చెక్కెర్లు కొడుతోంది.

ఇప్పటికే ట్రూజట్ విమానాయన సంస్థలో పెట్టుబడులు పెట్టిన రామ్ చరణ్‌.. ఇక మీదట మరిన్ని బిజినెస్ లు చేయాలని అనుకుంటున్నాడు. ఉపాసన సపోర్టు ఎలాగో ఉంది కాబట్టి.. మనోడు సొంతంగా ఒక హోటల్ చైన్ పెట్టేయాలని చూస్తున్నట్లు టాక్. అయితే ఈ చైన్ లో తన ఒక్కడి డబ్బులే కాకుండా.. మహేష్‌ బాబుతో కూడా పెట్టుబడి పెట్టిస్తున్నాడట. ఎలాగైతే చిరంజీవి తన స్నేహితుడు నాగార్జునతో కలసి వ్యాపారలు చేస్తున్నారో.. ఇప్పుడు చరణ్‌ కూడా మహేష్‌ తో కలసి అలాంటి వ్యాపారాలే చేస్తాడని టాక్.

ఏదేమైనా కూడా ఒకప్పుడు సినిమా హీరోలు ఎవరైనా కూడా.. నాలుగు సినిమాలు ఫ్లాపైతే ఇక కెరియర్ అండ్ లైఫ్‌ అయిపోయాయ్ అనే పరిస్థితి ఉండేది. సూపర్ స్టార్లు కూడా నడిరోడ్డుకు వచ్చేసిన రోజులున్నాయి. కాని చరణ్‌ అండ్ మహేష్‌ వంటి స్టార్లు చక్కగా ఇన్వెస్టు చేసేసి.. ఓల్డ్ ఏజ్ లో హ్యాపీ లైఫ్‌ గడిపేయాలని బాగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/