గ్యాంగ్ లిడర్ ని సెట్ చేశారా?

Wed Jun 13 2018 15:38:10 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ దర్శకులు చాలా మంది ఉన్నారు కానీ ఒకప్పుడు ఇండస్ట్రీలో కీలక నిర్మాతలుగా ఉన్న వారు మాత్రం ఎక్కువగా కనిపించడం లేదు. కొంత మంది సినిమాలు చేస్తున్నప్పటికీ అప్పటి స్థాయిలో హిట్స్ అందుకోలేకపోతున్నారు. అలాంటి ప్రొడక్షన్స్ లలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఒకటి. మెగాస్టార్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన నిర్మాత కె.ఎస్.రామారావుఅభిలాష.. ఛాలెంజ్.. రాక్షసుడు.. మరణ మృదంగం.. వంటి హిట్ సినిమాలను మొదట్లోనే వరుసగా తెరకెక్కించి మెగాస్టార్ కెరీర్ కి ఉపునిచ్చారు. అయితే స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ తరువాత మెగాస్టార్ కి ఆ ప్రొడక్షన్ కి గ్యాప్ వచ్చిందని ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి తనే కారణమని.. తేజ్ ఐ లవ్ యూ ఆడియో లాంచ్ లో మెగాస్టార్ ఓప్పుకున్నారు. ఇకపోతే మెగాస్టార్ ఇప్పుడు నిర్మాతకు మంచి ఆఫర్ ఇచ్చారని అదే వేడుకలో హింట్ ఇచ్చేశారు.

అది కూడా మెగా పవర్ స్టార్ తో సినిమా చేసే అవకాశం కె.ఎస్.రామారావు కి కల్పించారు. సాధారణంగా అవకాశం ఇవ్వడం అనేది అంత ఈజీగా తీసుకునే అంశం కాదు. దానికి ముందు బ్యాక్ గ్రౌండ్ వర్క్ బాగానే ఉంటుంది. ఆ విషయంలో మెగాస్టార్ ముందే ప్రిపేర్ అయ్యారని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రాజమౌళి తో చేసిన తరువాత తప్పకుండా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లోనే చేయాలని డిసైడ్ అయ్యారు. పైగా గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఆ సినిమా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక దర్శకుడిని ఒక మంచి కథను సెట్ చేసుకుంటే గ్యాంగ్ లీడర్ మ్యానియా మొదలవ్వచ్చని టాక్.