రంగస్థలం కోసం చెర్రీ కష్టాలు!!

Mon Jun 19 2017 14:41:20 GMT+0530 (IST)

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలం తాజా షెడ్యూల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో మొదటి షెడ్యూల్ ను గోదావరి తీరంలో షూట్ చేసిన యూనిట్.. ఇప్పుడు తర్వాతి షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ మొత్తంలో ఇదే అత్యంత క్లిష్టమైన షెడ్యూల్ గా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ప్రారంభం అవుతున్న షూటింగ్.. సూర్యాస్తమయం తర్వాత కూడా కొనసాగిస్తున్నారట. దాదాపుగా చీకటి పడిపోయే వరకూ షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. పలు కీలకమైన సన్నివేశాలు పొదల్లో షూటింగ్ చేయాల్సి ఉండడంతో.. మెగా పవర్ స్టార్ కు చిన్నపాటి గాయాలు కూడా అవుతున్నాయట. అయినా సరే ఏ చిన్న కంప్లెయింట్ కూడా చేయకుండా షూటింగ్ కొనసాగిస్తున్నాడట చెర్రీ. సన్నివేశాలు పక్కాగా వచ్చేందుకు..  మెగా పవర్ స్టార్ మాదిరిగా కష్టపడే హీరోలు అరుదుగా ఉంటారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరుగుతుండగా.. ఈనెలాఖరుతో ఇక్కడ షూట్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత హైద్రాబాద్ లోని స్టూడియోస్ లో నిర్మించిన పలు భారీ సెట్స్ లో షూటింగ్ చేయనున్నాడు దర్శకుడు సుకుమార్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/