Begin typing your search above and press return to search.

సొంతింటి లోనే చెర్రీకి ట్రబుల్స్

By:  Tupaki Desk   |   31 May 2016 11:30 AM GMT
సొంతింటి లోనే చెర్రీకి ట్రబుల్స్
X
మెగాస్టార్ చిరంజీవికి అసలు సిసలైన వారసుడిగా మెగాభిమానులు రామ్ చరణ్ నే చెప్పుకుంటారు. కుటుంబంలో ఎంత మంది ఉన్నా.. మెగాస్టార్ - పవర్ స్టార్ లను మించిన వాడు అవ్వాలని కోరుకుని.. మెగా పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే.. చరణ్ కి మాస్ లో ఎంత పట్టు ఉన్నా ఇప్పటివరకూ అభిమానులు ఆశించిన స్థాయి సినిమా పడలేదు. ఈ స్టేట్మెంట్ కి మగధీర ఒకటి మాత్రమే మినహాయింపు.

మొత్తం కెరీర్ లో అర డజన్ హిట్స్ ఉన్నా.. చెర్రీ నుంచి ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ మూవీ మాత్రం రాలేదు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా మినిమం 40 కోట్లు రాబట్టగలడనే పేరున్నా.. అక్కడి నుంచి సినిమాని బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకెళ్లలేకపోతున్నాడు. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి చేరుకోవడానికి రామ్ చరణ్ కి గట్టి పోటీనే ఉంది. ఇప్పుడు సొంత ఫ్యామిలీ నుంచి కూడా చెర్రీకి కాంపిటీషన్ పెరిగిపోతోంది. తన రిలేటివ్స్ తనకు ట్రబుల్ లా మారిపోతారేమో. చరణ్ మిస్ చేసుకున్న కథలతో సినిమాలు తీసేస్తూ హిట్స్ కొట్టేస్తున్నారు.

సరైనోడు సూపర్ హిట్ కొట్టారు బన్నీ, బోయపాటి. మొదట చెర్రీతోనే బోయపాటి శ్రీను సినిమా తీయాల్సి ఉంది. పూజా కార్యక్రమాలు జరిపాక సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత సరైనోడుతో హిట్ కొట్టేశాడు అల్లు అర్జున్. క్రిష్ కూడా సేమ్ స్టోరీ. చరణ్ వద్దన్నాక వరుణ్ తేజ్ తో కంచె తీసేసి సూపర్ అనిపించేసుకున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా కూడా చెర్రీ కాదనగానే వరుణ్ తేజ్ కి చేరిపోయింది. సాయి ధరం తేజ్ కూడా వరుసగా హిట్స్ కొట్టేస్తూ రేంజ్ పెంచుకుంటున్నాడు. బన్నీ ఇప్పటికే వరుసగా యాభై కోట్ల షేర్ సాధించిన 4 సినిమాలు ఇచ్చి టాప్ లీగ్ లో ఫిక్స్ అయిపోయాడు.

చూస్తుంటే.. సొంతింటి నుంచి చరణ్ కి పోటీ పెరిగిపోతోందని అర్ధమవుతోంది. మరీ ఏడాదికో సినిమా మాత్రమే చేసుకుంటూ వెళితే.. ఇంతమందిని దాటి పైకెళ్లి మెగాస్టార్ వారసుడు అనే పేరు కాపాడుకోవడం కష్టమవుతుందేమో రామ్ చరణ్.. కొంచెం స్పీడ్ పెంచితే బెటర్ అనిపించడం లేదూ.