Begin typing your search above and press return to search.

తల పట్టుకుంటున్న చిరు ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   21 March 2017 6:21 PM GMT
తల పట్టుకుంటున్న చిరు ఫ్యామిలీ
X
సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడు ఎవరి జీవితాలు హాట్ టాపిక్ గా మారిపోతాయో తెలీని పరిస్థితి. ఎవరి పుర్రెలో ఏదో ఆలోచన పుట్టి.. అప్పటికప్పుడు తన చేతికి అనిపించింది రాసేసి.. సోషల్ మీడియాలో పెట్టేస్తే.. అదే పెద్ద వైరల్ గా మారటం ప్రముఖులకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. తాజాగా మెగా స్టార్ కుటుంబానికి ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితే నెలకొంది.

గడిచిన రెండు..మూడు రోజులుగా సోషల్ మీడియాలోనూ.. ఫిలింనగర్ వర్గాల్లోనూ ఆసక్తికరమైన అంశంపై పెద్ద చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ హాట్ న్యూస్ ఏమిటంటే.. మెగాస్టార్ ఫ్యామిలీలో హ్యాపీ మూమెంట్ ఒకటి షురూ అయ్యిందని.. రాంచరణ్ తండ్రి కాబోతున్నట్లుగా ఒక వార్త పుట్టుకొచ్చింది.

ఇందులో ఒక్క శాతం కూడా నిజం లేదని స్పష్టం చేస్తోంది మెగా క్యాంప్. ఈ వార్తను ఎవరు పుట్టించారో కానీ..ఇదో పెద్ద వార్తగా మారటంతో.. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారట చెర్రీ అండ్ కో. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ గాలి వార్తను.. అదేదో గొప్ప వార్తగా.. తండ్రి కానున్న చెర్రీ అంటూ రకరకాల పేర్లతో ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఈ వార్తను పెట్టేయటంపై మెగా ఫ్యామిలీ తెగ ఫీలవుతోంది. ఎవరు చెప్పారని.. ఇలాంటి వ్యక్తిగతమైన వార్తల్ని సైతం క్రాస్ చెక్ చేయకుండా పబ్లిష్ చేసేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.నిజమే.. వారి ఆవేదనను అర్థం చేసుకోదగినదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/