ఫేస్ బుక్ ఆఫీస్ లో చెర్రీ స్టెప్పులు

Tue Jan 10 2017 15:43:04 GMT+0530 (IST)

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150కి నిర్మాణం వహించి.. రామ్ చరణ్ మెగా ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖైదీ రిలీజ్ కొన్ని గంటల్లోకి వచ్చేసింది. అటు చిరంజీవి తనయుడిగా.. ఇటు ఖైదీ నంబర్ 150 ప్రొడ్యూసర్ గా.. ప్రమోషన్స్ విషయంలో కొత్త కొత్త స్ట్రాటజీస్ ఫాలో అయిపోతున్నాడు మెగా పవర్ స్టార్.

హైద్రాబాద్ ఫేస్ బుక్ ఆఫీస్ నుంచి అరగంటకు పైగా లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్.. ఆ ఎపిసోడ్ ను ఫేస్ బుక్ లోని తన పేజ్ లో లైవ్ టెలికాస్ట్ చేయడమే కాదు.. ఆ వీడియోను స్పెషల్ గా పోస్ట్ చేశాడు కూడా. దాదాపు మొదటి అరగంట పాటు.. చిరు గురించి.. చెర్రీ గురించి ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి.. డిస్కషన్ లో పాల్గొన్న చరణ్.. ఆ తర్వాత తనలోని మెగాపవర్ స్టార్ ను చూపించేశాడు. ఆ ఈవెంట్లో పాల్గొన్న ఓ అమ్మాయి.. చెర్రీతో కలిసి డ్యాన్స్ చేయాలని అడగడంతో.. ఓకే చెప్పేసిన చెర్రీ.. ఓ నలుగురు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశాడు.

'అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు' సాంగ్ కోసం నలుగురు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ వేసిన చెర్రీ.. ఓ అమ్మాయి వేస్తున్న స్టెప్స్ వేస్తున్న ఈజ్ చూసి.. నేనలా చేయలేను అనేశాడు. చివరకు ఆ అమ్మాయిలతో కలిసి సింపుల్ స్టెప్స్ వేస్తూ అందరినీ ఉత్సాహంలో నింపేశాడు. రామ్ చరణ్ ఫేస్ బుక్ లైవ్ మాత్రం వీర లెవెల్లో సూపర్ హిట్ అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/