Begin typing your search above and press return to search.

చరణ్ ముందుంది చిన్న సవాల్ కాదు

By:  Tupaki Desk   |   26 Sep 2018 8:48 AM GMT
చరణ్ ముందుంది చిన్న సవాల్ కాదు
X
బోయపాటి శీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ నిర్విరామంగా సాగుతోంది. టాకీ పార్ట్ పరంగా ఇప్పటికే ముప్పాతిక దాకా పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్. పాటల చిత్రీకరణ కూడా వచ్చే నెల నుంచి మొదలుపెట్టబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నామని నిర్మాత డివివి దానయ్య మూడు నెలల క్రితమే చెప్పేసారు. అనూహ్యంగా ఏదైనా జరిగితే తప్ప ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. కానీ సంక్రాంతి పోరులో గట్టిగా నిలవడం అనేది మాత్రం అంత ఈజీ కనిపించడం లేదు

ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇంచుమించు చరణ్ వస్తున్న డేట్ లో కాస్త అటు ఇటు గా ఉంటుంది. ఈ పాటికే ప్రమోషన్ ను పీక్స్ కు తీసుకెళ్లారు. వరసబెట్టి పోస్టర్లతో లుక్స్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే చరణ్ కంటే బాలయ్య కొన్ని అడుగులు ముందున్నట్టే. మరోవైపు సంక్రాంతికే బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎఫ్2 ఆన్ లొకేషన్ స్టిల్స్ ఇప్పటికే ఆన్ లైన్ లో రచ్చ చేస్తున్నాయి. కాస్త సైలెంట్ గా ఉన్నది చరణ్ టీమే.

కాని అభిమానులతో పాటు చరణ్ యూనిట్ సభ్యులు మాత్రం చాలా ధీమాగా ఉన్నారట. పోటీ ఎంత ఉన్నా తమది ఫక్తు మాస్ మసాలా ఎంటర్ టైనర్ కావడంతో సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నా దీనికి ప్రత్యేకమైన వెయిటేజ్ ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ ది జీవిత కథ కాబట్టి అందులో మసాలాలకు అవకాశం లేదు. పైగా వ్యక్తిగత జీవితం కంటే సినిమా ప్రస్థానం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందని చెబుతున్నారు. సో చరణ్ కు మాస్ ప్రేక్షకులు ఆ సినిమాకు డైవర్ట్ అవుతారన్న భయం లేదు.

ఖైదీ నెంబర్ 150 ఇదే తరహాలో అవుట్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా సంక్రాంతి బరిలో దూకి వంద కోట్లకు పైగా లాగేసింది. అందుకే చెర్రీ ఫ్యాన్స్ టెన్షన్ పడటం లేదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ తో పాటు ఈవీవీ గారి పెద్దబ్బాయి మాజీ హీరో ఆర్యన్ రాజేష్ కూడా మరో కీలక పాత్ర కనిపిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి స్టేట్ రౌడీ అనే టైటిల్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. కానీ అది వట్టి పుకారని కొట్టిపారేస్తున్నారు మునీర్ సభ్యులు. దసరాకు టైటిల్ తో పాటు టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది.