Begin typing your search above and press return to search.

చెర్రీ సినిమాల‌పై క్లారిటీ

By:  Tupaki Desk   |   9 Feb 2016 6:25 AM GMT
చెర్రీ సినిమాల‌పై క్లారిటీ
X
రామ్‌ చ‌ర‌ణ్ న‌టించ‌నున్న కొత్త సినిమాల‌పై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ యేడాది ఆయ‌న సినిమాలు ఎన్ని ప్రేక్ష‌కుల ముందుకొస్తాయో ఏంటో తెలియ‌దు కానీ... మూడు చిత్రాల్ని మాత్రం మొద‌లుపెట్ట‌బోతున్నారు. మొద‌టి చిత్రం త‌ని ఒరువ‌న్ రీమేక్‌ తెర‌కెక్క‌బోతోంది. సురేంద‌ర్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఆ సినిమాకి ఈ నెల 21న కొబ్బ‌రికాయ కొట్టేస్తారు. చ‌ర‌ణ్ ఈ సినిమా గురించి ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ కొంత‌కాలంగా ఫిల్మ్‌ న‌గ‌ర్‌ లో రూమ‌ర్లు చ‌క్క‌ర్లు కొట్టాయి. త‌ని ఒరువ‌న్ రీమేక్ లాంచ్ అవ్వ‌డం క‌ష్ట‌మే అని మాట్లాడుకొన్నారు. కానీ వాట‌న్నిటినీ తోసిపుచ్చుతూ త‌ని ఒరువ‌న్ రీమేక్‌ ని ప‌ట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అలాగే జూన్ నుంచి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమా సెట్స్‌ పైకి వెళుతుంది.

వాటితోపాటు యేడాది చివ‌ర్న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమా మొద‌ల‌వుతుంది. డీవీవీ దాన‌య్య ఆ సినిమాని నిర్మించ‌బోతున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల‌కీ రామ్‌ చ‌ర‌ణ్ సంతకం చేశార‌ట‌. బ్రూస్‌ లీ త‌ర్వాత రామ్‌ చ‌ర‌ణ్‌ కి గ్యాప్ వ‌చ్చింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ఆ గ్యాప్‌ ని కొత్త ప్రాజెక్టుల‌ కోసం స‌ద్వినియోగం చేసుకున్నాడ‌న్న‌మాట‌. ఇక నుంచి అస‌లు గ్యాప్ లేకుండా ఈ సినిమాల‌పై దృష్టి పెట్ట‌బోతున్నాడు చెర్రీ. వీటితోపాటు త‌న తండ్రి రీ ఎంట్రీ సినిమాకి నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తారు.