Begin typing your search above and press return to search.

ఈ రికార్డుల మోతేంది రామ్ చరణూ

By:  Tupaki Desk   |   9 Oct 2015 10:30 AM GMT
ఈ రికార్డుల మోతేంది రామ్ చరణూ
X
యుఎస్ లో మిలియన్ క్లబ్.. నాని లాంటి చిన్న హీరో సైతం ఈ ఘనత సాధించేశాడు. మరి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఆ క్లబ్బులో అడుగుపెట్టకపోతే ఏం బావుంటుంది చెప్పండి. అందుకే టార్గెట్ గట్టిగానే ఫిక్స్ చేశాడు మెగా కుర్రాడు. మిలియన్ క్లబ్బులోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా యుఎస్ లో సరికొత్త రికార్డుల మోత మోగించడానికి కూడా బాగానే ప్లాన్ చేశాడు. విడుదలకు ముందే అక్కడ రామ్ చరణ్ రికార్డుల రచ్చ మొదలైపోవడం విశేషం.

ఆడియో రిలీజ్ కన్నా ముందే ‘బ్రూస్ లీ’ రిలీజ్ ఇక్కడ క్లోజ్ అయిపోవడం రికార్డు. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమాకు లేని విధంగా ‘బ్రూస్ లీ’ని యుఎస్ లో 220 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా సినిమాను ఓవర్సీస్ లో 350 థియేటర్లలో ఒకేసారి రిలీజ్ చేయడం కూడా టాలీవుడ్ కు రికార్డే. టెక్సాస్ లో ఏకంగా 22 లొకేషన్లలో ‘బ్రూస్ లీ’ రిలీజవుతోంది. తెలుగు సినిమాకు ఇదీ రికార్డే. ఇక ఏ సౌత్ ఇండియన్ ఫిలిం రిలీజ్ కాని విధంగా డల్లాస్ ఏరియాలో పది లొకేషన్లలో ‘బ్రూస్ లీ’ని విడుదల చేయబోతున్నారు. అలస్కా ప్రాంతంలో తొలిసారి విడుదలవుతున్న తెలుగు సినిమాగానూ ‘బ్రూస్ లీ’ చరిత్ర సృష్టిస్తోంది. ఇంకా యుఎస్ లో ఏరియాల వారీగా స్క్రీనింగ్స్ లిస్టు తీస్తే ‘బ్రూస్ లీ’ అనేక రికార్డులు ఖాతాలో వేసుకుంది. సినిమాకు మంచి టాక్ వస్తే రామ్ చరణ్ తనకిప్పటిదాకా సాధ్యం కాని మిలియన్ కబ్ల్ రికార్డును రెండు రోజుల్లో అందుకోవడం ఖాయం. ఆ ఊపు తర్వాత కూడా కొనసాగితే సినిమా 3 మిలియన్ క్లబ్బును టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.