Begin typing your search above and press return to search.

కామెంట్‌: మహేష్‌ ను మించిపోవాలనే

By:  Tupaki Desk   |   6 Oct 2015 1:30 AM GMT
కామెంట్‌: మహేష్‌ ను మించిపోవాలనే
X
బాహుబ‌లి - శ్రీ‌మంతుడు - భ‌లే భ‌లే మ‌గాడివోయ్ .. ఒక‌దాని వెంట ఒక‌టిగా రిలీజై ఓవ‌ర్సీస్‌ ని కొల్ల‌గొట్టేశాయి. భారీ వ‌సూళ్ల‌ తో దుమ్మ దులిపేశాయి. ఈ మూడు సినిమాలు చూపించిన దారినే మిగ‌తా వాళ్లు అనుస‌రించే ప‌రిస్థితి వ‌చ్చిందిప్పుడు. ఇక నుంచి రిలీజ‌య్యే ప్ర‌తి సినిమాకి ఓవ‌ర్సీస్‌ లో, అమెరికా మార్కెట్లో్ కావాల్సినంత ప్ర‌చారం చేయాల‌ని అంతా ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు. ముంద‌స్తు ప్ర‌చారం వ‌ల్ల అమెరి కా డాల‌ర్ల‌ను బాగా వెన‌కేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారంతా.

ఈ వ‌రుస‌లో ఇప్ప‌టికే అఖిల్‌ - రామ్‌చ‌ర‌ణ్‌ - గుణ‌శేఖ‌ర్ లైన్‌లో ఉన్నారు. త్వ‌ర‌లో రిలీజ్‌ కి రెడీ అవుతున్న ఈ మూడు సినిమాల‌కు సంబంధించిన ఓవ‌ర్సీస్ ప్ర‌చారం లో స్సీడ్ పెంచేస్తున్నారు. అఖిల్ ఇప్ప‌టికే అమెరికా వెళ్లి త‌న సినిమాకి బోలెడంత ప్ర‌చారం చేసుకున్నాడు. విదేశాల్లో అక్కినేని చియాన్ బాగా ఫేమ‌స్ అయిపోయాడు. అలాగే రుద్ర‌మ‌దేవి 3డికి ఇప్ప‌టికే ప్ర‌చారం వ‌చ్చేసింది కాబ‌ట్టి గుణ‌శేఖ‌ర్ రిలీజ్ టైమ్‌ లో మ‌రింత విస్ర్త‌తం గా ప్ర‌మోష‌న్ చేయాల‌ని ఫిక్స‌య్యాడు. ఇక రామ్‌చ‌ర‌ణ్ సినిమాల‌కు ఇంత‌కాలం విదేశాల్లో స‌రైన మార్కెట్ లేదు. మ‌గ‌ధీర త‌ప్ప వేరే ఏ సినిమాకి డాల‌ర్లు కుర‌వ‌లేదు. అందుకే ఈసారి ఆ బ్యాడ్ ట్రాక్‌ని స‌రిచేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. శ్రీ‌నువైట్ల తెర‌కెక్కించే ఎంట‌ర్‌టైన్‌మెంట్ల‌కు విదేశాల్లో గిరాకీ ఉంది కాబ‌ట్టి ఇప్పుడు బ్రూస్‌లీ సినిమాకి అది పెద్ద ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు. విదేశీ మార్కెట్లో మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో వెలిగిపోవాల‌ని ఇలా హీరోలంతా క‌ల‌లు గంటున్నారు.

అయితే విదేశీ మార్కెట్లో అడుగుపెట్టి పెద్ద విజ‌యం సాధించాలంటే రిలీజ్ తేదీ విష‌యంలో ప‌క్కా క్లారిటీ కావాల్సిందేన‌ని చెబుతున్నారు డిస్ర్టిబ్యూట‌ర్ కం నిర్మాత సుధాక‌ర్‌రెడ్డి. చిన్న సినిమా అయినా పెద్ద ప్ర‌చారం చేస్తే భ‌లే భ‌లే మ‌గాడివోయ్ త‌ర‌హా లాభాలొస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. పెద్ద హీరోకి అయినా ప్ర‌చారం త‌ప్ప‌నిస‌రి అని న‌మ్ర‌త చెబుతున్నారు. ఇలా ఒక్కొక్క‌రు త‌మ అభిప్రాయాల్ని, అనుభ‌వాల్ని చెబుతున్నారు. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే. విదేశీ మార్కెట్లో మ‌హేష్‌ని మించి డాల‌ర్లు వ‌సూలు చేయాలి. రికార్డులు కొట్టేయాలి. కోట్ల‌లోకి క‌రెన్సీని దండుకోవాలి. మారిన ట్రెండ్‌లో కొత్త సినిమాకి విదేశీ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. కాబ‌ట్టి ఇక మ‌న సినిమా హవా సాగించ‌డం ఖాయం.. అని చెబుతున్నారంతా.