Begin typing your search above and press return to search.

స్టేట్ రౌడీ పై కన్నేసిన బోయపాటి?

By:  Tupaki Desk   |   26 Sep 2018 9:00 AM GMT
స్టేట్ రౌడీ పై కన్నేసిన బోయపాటి?
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో తన తాజా చిత్రాన్ని చేస్తున్నాడు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాను #RC12 పేరుతో ప్రస్తావిస్తున్నారు. తాజా గా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి పాత చిత్రం 'స్టేట్ రౌడీ' టైటిల్ వాడుకోవాలని బోయపాటి అనుకుంటున్నాడట.

1989 రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో యావరేజ్ గా నిలిచింది. బీ. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్. ఈ సినిమా టైటిల్ ను చరణ్ - బోయపాటి సినిమాకు పరిశీలిస్తున్నారని ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. దసరా పండగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తారని.. ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తారని అంటున్నారు. బోయపాటి ఇప్పటివరకూ ఇలా పాత టైటిల్స్ వాడిన సందర్భం లేదు.. మరి ఈ టైటిల్ నిజంగా అనుకుంటున్నారా లేదా జస్ట్ గాసిప్పా అనే విషయం తేలాల్సి ఉంది.

ఇక #RC12 టీమ్ ప్రస్తుతం అజర్ బైజాన్ లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో బిజీగా ఉంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.