చిరు ఫిజిక్ మామూలుగా ఉండదట

Sun Jun 18 2017 15:46:37 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లో ఆయన లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పదేళ్ల కిందట బ్రేక్ తీసుకునే ముందు చేసిన సినిమాల్లో కంటే ఇప్పుడే చిరు అందంగా కనిపించాడంటే అతిశయోక్తి ఏమీ కాదు. ‘ఖైదీ..’లో ఆయన అంత మంచి లుక్‌లో కనిపించారు. బరువు తగ్గించుకుని.. గ్లామర్ పెంచుకుని సరికొత్తగా కనిపించాడు చిరు. ఐతే చిరు తన తర్వాతి సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో ఇంకా మంచి లుక్ లో కనిపిస్తాడని అంటున్నాడు ఆయన తనయుడు రామ్ చరణ్. ఇందుకోసం చిరు ఎంతో కష్టపడుతున్నట్లు చరణ్ చెప్పాడు.‘‘ఖైదీ నెంబర్ 150 కోసం నాన్న గారు చాలా కష్టపడ్డారు. వయసుని కూడా లెక్క చేయలేదు. ఆయన కష్టం చూస్తే నాకు ఒక విధమైన బాధ.. సిగ్గు కలిగింది. మా యువతరం మరింత కష్టపడాలని అనిపించింది. ఆయన చాలాసేపు వ్యాయామం చేస్తారు. ఆయనే మాకు ఓ ట్రైనర్. ఆయన్నుంచి మేం నేర్చుకోవాలి. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా కోసం కూడా ఇంకా కష్టపడుతున్నారు. ఆ సినిమాలో ఆయన లుక్ తో పాటు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. టఫ్ పర్సనాలిటీతో.. ఫిజిక్ తో కనిపిస్తారు. రాకేష్ అనే ట్రైనర్  ప్రస్తుతం నాన్నకు శిక్షణ ఇస్తున్నారు. సినిమా మొదలయ్యే సమయానికి నాన్న మరింత మంచి లుక్ లోకి వస్తారు’’ అని చరణ్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/