Begin typing your search above and press return to search.

రారండోయ్.. నా నటన చూడండి

By:  Tupaki Desk   |   23 May 2017 4:47 AM GMT
రారండోయ్.. నా నటన చూడండి
X

ఇప్పుడు వస్తున్న అందరి హిరోయిన్లు చేస్తుంది ఒకటే.. పాటలలో డాన్స్ చేయడం హీరోతో ప్రేమకలాపాలు సాగించడం. ఇంతకు మించి మన తెలుగు కథలో హీరోయిన్ కు రోల్ ఉంది అంటే అది కాస్త చెప్పుకోతగ్గ సినిమానే అవుతుంది. ఇప్పుడు తెలుగులో ఒకానొక కమర్షియల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి స్థితి లోనే ఉంది. కాకపోతే రాబోతున్న సినిమా ‘రారాండోయ్ వేడుక చూద్దాం’తో తన నటనకు గుర్తింపు వస్తుంది అని అమ్మడు తపన పడుతోంది.

ధృవ సినిమాలో కాస్త మంచి పాత్ర చేసినా అది కూడా ఒక మాదిరి తెలుగు హీరోయిన్ లాంటి పాత్రనే. పైగా పరేషానురా అంటూ అమ్మడు ఒలకబోసిన టాప్ నాచ్ గ్లామర్.. పెద్ద టాకింగ్ పాయింట్ అయిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న సినిమా రారాండోయ్ వేడుక చూద్దాంలో కథ బలం చాలా ఉందని కుటంబనేపధ్య చిత్రం కావడంతో మంచి నటన చేయడానికి వీలుపడింది అని చెబుతోంది అమ్మడు. ఈ సినిమాలో రకుల్ ఒక ఆదర్శ భావాలు ఉన్న కాలేజీ అమ్మాయి భ్రమరాంభగా కనిపిస్తుందట. షూటింగ్ ఆఖరి రోజున నాగ్ స్వయంగా ఫోన్ చేసి అభినందించడంతో.. తన పాత్ర అద్భుతహా అని అర్ధమైందట. రిలీజయ్యాక తనపై ఉన్న ఔట్ లుక్ మారిపోతుందని ఈమె ఆశ.

నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మాతగా కల్యాణ్ కృష్ణ డైరెక్టర్ గా వస్తున్న ఈ సినిమా మే 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన క్రితం సినిమా విన్నర్ ఫ్లాప్ కావడంతో రకుల్ ఈ సినిమా పై చాలా ఆశాలే పెట్టుకుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చాడు. మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ఒక ఆయువుపట్టు లాంటిదే అని చెప్పవచ్చు. ఇవన్నీ రకుల్ కు ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి.