Begin typing your search above and press return to search.

స్టూడియోలో భ్ర‌మ‌రాంబ బెదిరిస్తుందే!

By:  Tupaki Desk   |   29 May 2017 8:38 AM GMT
స్టూడియోలో భ్ర‌మ‌రాంబ బెదిరిస్తుందే!
X
కొంత‌మందికి కొన్ని సినిమాలు చేసే ఉప‌కారం అంతా ఇంతా కాదు. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న ఇమేజ్ మొత్తాన్ని మార్చేయ‌ట‌మేకాదు.. తెర‌పై వారి ఆయుష్షును మ‌రింత‌గా పెంచేసే రీతిలో కొన్ని సినిమాలు వ‌చ్చేస్తుంటాయి. తాజాగా విడుద‌లైన రారండోయ్‌.. వేడుక చూద్దాం సినిమా విష‌యానికి వ‌స్తే.. ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన ర‌కుల్ సుడి తిరిగిపోయిందంటున్నారు.

అవుట్ అండ్ అవుట్ తెలుగమ్మాయిలా ఉండ‌ట‌మే కాదు.. త‌న పాత చిత్రాల‌కు భిన్నంగా ఈ మూవీలో మెరిసిపోయిందంటున్నారు. ఈ సినిమాకు ర‌కుల్ అందం పెద్ద అస్సెట్టుగా మారింద‌న్న టాక్ వ‌చ్చింది. ఎక్క‌డా అశ్లీలం లేకుండా.. ఎక్స్ పోజింగ్ అన్న దానికి ద‌రిదాపుల్లోకి వెళ్ల‌కుండా హీరోయిన్ ను ఎంత అందంగా చూపించొచ్చ‌న్న విష‌యాన్ని ఈసినిమా నిరూపించింది.

ఈ సినిమాతో ర‌కుల్ ఇమేజ్ మ‌రింత పెరిగిపోయింద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ప్ర‌స్తుతం ఛాన‌ళ్ల‌కు వెళుతున్న ర‌కుల్ ను చూసి అవాక్కు అయ్యే ప‌రిస్థితి. వెండి తెర మీద అద‌ర‌గొట్టేసిన అందానికి భిన్నంగా ఛాన‌ళ్ల ఇంట‌ర్వ్యూలో మాత్రం అమ్మ‌డు కాస్త ఒళ్లు చేసిన‌ట్లుగా క‌నిపించ‌టం చిత్రంగా మారింది. వెండితెర మీద ఆహ్లాదంగా క‌నిపించిన భ్ర‌మ‌రాంబ‌.. ఛాన‌ల్ స్టూడియోలో మాత్రం కాస్త బెద‌ర‌గొట్టేలా ఉంద‌నిపిస్తోంది. ఛాన‌ళ్ల ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లేట‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకో ర‌కుల్‌..!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/