Begin typing your search above and press return to search.

ర‌కుల్‌ ను ఆ హీరో మూవీ నుంచి తీసేశార‌ట‌

By:  Tupaki Desk   |   23 March 2017 7:35 AM GMT
ర‌కుల్‌ ను ఆ హీరో మూవీ నుంచి తీసేశార‌ట‌
X
టాలీవుడ్‌లో అగ్ర‌హీరోల సినిమా అంటే చాలు.. ప‌క్క‌న ర‌కుల్ ఉండాల‌న్న‌ట్లుగా మారింది. త‌న అందంతో.. అభిన‌యంతో అభిమానుల మ‌న‌సుల్ని దోచేసే ఈ భామ‌కు స్టార్‌స్టేట‌స్ అంత తేలిగ్గా రాలేద‌నే చెప్పాలి. మిగిలిన హీరోయిన్ల మాదిరి పైపై మాట‌లు కాకుండా.. కాస్త ఓపెన్ గానే మాట్లాడుతుంద‌ని చెప్పాలి. కాలేజీ రోజుల్లోనే మోడ‌లింగ్ చేసిన ఆమె.. సినిమా అవ‌కాశాలు అంత తేలిగ్గా రాలేద‌న్నది నిజం. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలు.. అవ‌మానాల త‌ర్వాతే తాజా స్టార్ స్టేట‌స్‌ను సొంతం చేసుకున్నార‌ని చెప్పాలి. అందుకోసం ఆమె ఎంత క‌ష్ట‌ప‌డ్డార‌న్న విష‌యాన్ని తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసింది.

ఈ సంద‌ర్భంగా ఆమె చెప్పిన మాట‌లు వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. టాలీవుడ్ అన్న‌ది కూడా ఒక‌టి ఉంద‌న్న విష‌యం తాను చ‌దువుకునే రోజుల్లో తెలీద‌న్న ఆమె.. పాకెట్ మ‌నీ కోసం క‌న్న‌డ మూవీ చేసిన‌ట్లుగా చెప్పాలి. త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాధ్ చిత్రంలో అవ‌కాశం వ‌చ్చినా.. స్ట‌డీస్ దెబ్బ తింటాయ‌ని ఒప్పుకోలేదంది. కోరి వ‌చ్చిన పూరీ సినిమాను చేయ‌ని ర‌కుల్ త‌ర్వాత తెలుగులో ఫైవ్ మినిట్స్ క్యారెక్ట‌ర్ చేయాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. అయిన‌ప్ప‌టికీ.. ఓకే చేసేసిందే కానీ ఎందుక‌ని వ‌దిలేయ‌లేదు.

సీరియ‌స్‌ గా తెలుగు సినిమాల మీద ఫోక‌స్ చేద్దామ‌ని ఫీల్ అయిన వేళ‌.. డార్లింగ్ ప్ర‌భాస్‌తో మిస్ట‌ర్ ఫ‌ర్ ఫెక్ట్ సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. నాలుగు రోజుల షూటింగ్ కూడా అయ్యింది. ఆ త‌ర్వాత ఆమెను రిజెక్ట్ చేసేశార‌ట‌. ఇప్ప‌టికీ త‌న‌ను ఎందుకుతీసేశార‌న్న విషయం త‌న‌కు తెలీద‌న్న మాట‌ను ర‌కుల్ చెబుతున్న‌ప్పుడు.. ఆమెకొచ్చిన పేరు ప్ర‌ఖ్యాతులు అంత తేలిగ్గా ఏమీ రాలేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఆమెను లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చిన వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ త‌ర్వాత కూడా పెద్ద పెద్ద సినిమాల్లో చాన్స్ ఇచ్చి.. త‌ర్వాత తీసేసిన‌ట్లుగా చెప్పింది ర‌కుల్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/