కార్తీ ఖాకీ.. రకుల్ పేదింటి పిల్ల

Tue Sep 12 2017 17:02:21 GMT+0530 (IST)

టాలీవుడ్ లో కోలీవుడ్ హీరోల హావా ఎప్పటినుంచొ నడుస్తున్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో టాలీవుడ్ లో తమకంటూ ఓ స్థాయిని ఏర్పరచుకున్న హీరోలల్లో కార్తీ ఒకరు. కార్తీ సినిమాలకు తెలుగులో మార్కెట్ బాగానే ఉంది. అక్కడ ఆడని సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ చేసి విజయాన్ని అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కార్తీ కూడా టాలీవుడ్ ఆడియెన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూ ఉంటాడు.

అయితే గత కొంత కాలంగా కార్తీ గత చిత్రాల తరహాలో హిట్స్ అందుకోవడం లేదు. భారీ స్థాయిలో చిత్రాలను రిలీజ్ చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. చివరికి మణిరత్నం లాంటి దర్శకుడు తెరకెక్కించిన చెలియా కూడా కార్తీకి హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ సారి ఓ కొత్త తరహా కథతో రాబోతున్నాడు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న "తీరన్ అథిగారమ్ ఒండ్రు" అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను తెలుగులో ఖాకీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వినోత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. లుక్ లో కార్తీ -రకుల్ చాలా సింపుల్ గా ఉన్నారు.  అలాగే ఈ సినిమాలో రకుల్ ఒక పేదింటి పిల్లగా కనిపించనుందట. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి ఎదురైనా ప్రమాదాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే అసలు కథాంశం అని తెలుస్తోంది. ఇక తెలుగులో కార్తీ దీపావళి కానుకగా ఖాకీ ను భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే అప్పుడు నాగార్జున రాజుగారి గది 2 అండ్ రవితేజ -రాజా ది గ్రేట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ పోటీలో కార్తీ నిలుస్తాడా లేదా అనేది కాస్త సందేహాగానే ఉంది.