Begin typing your search above and press return to search.

రకుల్ పై మనసు పడిన కోలీవుడ్

By:  Tupaki Desk   |   22 Sep 2017 3:30 PM GMT
రకుల్ పై మనసు పడిన కోలీవుడ్
X
కాలం కలిసొచ్చినప్పుడు క్రేజ్ డబులవుతుంది.. అవకాశాలు ఆగకుండా వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ కు టైం ఈ రేంజిలోనే కలిసొచ్చినట్టుంది. ఈ ఏడాది తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం.. జయజానకి నాయక సినిమాలు రిలీజయ్యాయి. ఈ రెండింటిలోనూ ఆమె నటనకు మంచిపేరే వచ్చింది. తాజాగా మహేష్ బాబు హీరోగా తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన స్పైడర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీంతో హ్యాట్రిక్ హిట్ లభిస్తుందని రకుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.

స్పైడర్ పుణ్యమాని రకుల్ కు చెన్నై నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఎంతలా అంటే ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయడానికి వీలు లేదు బాబోయ్ అంటున్నా వినిపించుకోనంతగా.. కోలీవుడ్ టాప్ హీరోలు అజిత్ - విశాల్ - శివకార్తికేయన్ - శింబుతో పాటు మిగతా హీరోలు కూడా రకుల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని తెగ ఉత్సాహపడిపోతున్నారు. ‘‘డేట్స్ అడ్జస్ట్ చేయలేక విశాల్ సినిమా వద్దనుకుని అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేయడానికి కూడా రకుల్ సిద్ధపడిపోయింది. కానీ విశాల్ అందుకు ఒప్పుకోలేదు. దానికి బదులు ఆమెకు వీలయినప్పుడే డేట్స్ అడ్జస్ట్ చేయమని అడిగాడని’’ కోలీవుడ్ లో టాక్.

రకుల్ ప్రీత్ తమిళంలో కార్తి పక్కన తీరన్ అధిగారం ఒండ్రు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె కెరీర్ లోనే తొలిసారి పేద యువతి పాత్ర చేస్తోంది. ప్రస్తుతం సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా అయ్యారీ అనే హిందీ సినిమా షూటింగ్ లో రకుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ అవుతోంది. ఆమె హైదరాబాద్ కు వచ్చాక కొత్తగా ఏ తమిళ సినిమాల్లో నటించేది... ఎప్పటి నుంచి షూటింగులకు వెళ్లేది ఓ క్లారిటీ వస్తుందనేది ఈ సొగసరి సన్నిహితుల మాట.