మరో బ్రాండ్ అంబాసిడర్ గా రకుల్

Thu Oct 12 2017 13:06:20 GMT+0530 (IST)

టాలీవుడ్ అంటే అంతే! ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే చాలు ఎటువంటి స్టార్ హీరోయిన్ అయినా ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారు. టాలీవుడ్ లో పరభాషా హీరోయిన్లు ఎక్కువగానే ఉన్నారన్నది తెలిసినియా విషయమే. ఇక భవిష్యత్తులో కూడా వారే ఉంటారని కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అప్పటివరకు చాలా మంది పరభాషా హీరోయిన్లు ఇక్కడే సెటిల్ అవుతూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలుగు కుటుంబంలో ఒకరిగా కలిసిపోతున్నారు.రీసెంట్ గా అక్కినేని వారి కోడలైన సమంత కూడా ఇకనుంచి ఇక్కడే ఉంటుంది. అయితే ఆమె ఇంతకుముందే హ్యండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒక మంచి బాధ్యతతో తెలుగువారికి  మరింత దగ్గరైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'భేటీ బచావో.. భేటీ పడావో' కార్యక్రమానికి తెలంగాణ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలను తీసుకుంది.  

రకుల్ కి సమాజసేవ పై ఆసక్తి బాగానే ఉంది. ఇప్పుడు ఓ మంచి కార్యక్రమానికి ప్రచారకర్తగా బాధ్యత రావడంతో చాలా సంతోష పడింది. రీసెంట్ గా ఆమె హైదరాబాద్ లో ఓ ఇల్లును కూడా కొనుక్కుంది.  ఆడపిల్లల సంరక్షణ కోసం. అలాగే వారి చదువులపై అవగాహన తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని అంటోంది. ఓ విధంగా చెప్పాలంటే సమంత కన్నా రకుల్ కి కొంచెం పెద్ద వర్క్ ఉన్న బాధ్యత దక్కింది. మరి ఎంతవరకు కష్టపడుతుందో చూడాలి.