స్టార్ హీరోయిన్ స్కెలిటన్ లా మారిందే

Thu Jun 14 2018 18:01:50 GMT+0530 (IST)

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మొదట్లో కొన్ని ఎత్తు పల్లాలను చూసినా వరుసగా కొన్ని హిట్లు కొట్టేసారికి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఈమధ్య టాలీవుడ్ నుండి తన దృష్టిని కోలీవుడ్ మరియు బాలీవుడ్లో అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న రకుల్ ప్రీత్ ఇప్పుడు ఎముకలగూడులా మారిపోయింది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అదేంటి అనుకుంటున్నారా.. మొన్నీమధ్యే రకుల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనే ఒక మ్యాగజైన్ కవర్ పేజీ మీద దర్శనమిచ్చింది. అందులో బాగా బక్క చిక్కిపోయి కనిపించడంతో ఫ్యాన్స్ అంతా అలా అంటున్నారు అన్నమాట. సైజ్ జీరో కి స్లిమ్ గా ఉండటానికి మరియు బక్కగా ఉండటానికి తేడా తెలియట్లేదు రకుల్ కి అంటూ చురకలు వేస్తున్నారు. హెల్త్ అండ్ న్యూట్రీషన్ మ్యాగజైన్ కు పోజ్ ఇస్తూ మరీ మాల్ న్యూట్రిషన్ అయినట్టు కనిపిస్తోంది అని జోకులు పేలుస్తున్నారు కొందరు.

టాలీవుడ్ హీరోయిన్లు అందరిలో మిస్ అవ్వకుండా జిమ్ కి వెళ్తూ ఫిట్నెస్ ను కాపాడుకునే హీరోయిన్లలో మొదటి పేరు రకుల్ డే ఉంటుంది. జిమ్ చేయకపోతే తనకు ఏమి తోచదని అసలు ఎప్పుడు వీలైతే అప్పుడు జిమ్ లొనే గడిపేస్తానని రకుల్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పింది. ఇదంతా సరే కానీ ఫిట్ గా ఉండకుండా ఇలా బక్క చిక్కిపోతే ఎలా రకుల్?