Begin typing your search above and press return to search.

మెగా హీరో ప్రపోజ్ కంటే చావే బెటర్

By:  Tupaki Desk   |   19 Feb 2017 9:21 AM GMT
మెగా హీరో ప్రపోజ్ కంటే చావే బెటర్
X
ఓ సినిమాలో కలిసి నటించడం అంటే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ తప్పనిసరి. పైగా కుర్ర హీరో హీరోయిన్లు అంటే రొమాన్స్ పండించాల్సిందే. దాన్ని చూసి యూత్ తరించాల్సిందే. ఈ నెల 24న రిలీజ్ కానున్న విన్నర్ మూవీలో మెగా హీరో సాయి ధరంతేజ్.. యంగ్ సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంలో బాగానే మెప్పించేశారనే సంగతి టీజర్స్ చూస్తే అర్ధమవుతోంది.

కానీ రియల్ లైఫ్ లో మాత్రం రియాక్షన్ వేరేగా ఉంటోంది. ప్రస్తుతం వీరిద్దరూ విన్నర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుడగా.. రకుల్ కి మీరు ప్రపోజ్ చేస్తే ఎలా చేస్తారు అనే ప్రశ్న తేజుకి ఎదురైంది. ఇంతలోనే మైక్ అందుకున్న రకుల్ 'ప్లీజ్ నాకు ప్రపోజ్ చేయకు. నువ్వు ప్రపోజ్ చేస్తే నేను చచ్చిపోతా' అనేసింది రకుల్. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు రకుల్ అని సాయిధరం తేజ్ అడిగినా సరే ఏ మాత్రం కనికరించలేదు ఈ బ్యూటీ. మరి తేజుకి మీరెలా ప్రపోజ్ చేస్తారని రకుల్ ని అడిగితే.. 'నేనా.. ధరమ్ నా.. నా జీవితంలో చేయను' అని చెప్పింది.

'అంటే నువ్వు ప్రపోజ్ చేయడానికి కూడా నేను పనికిరానన్న మాట.. నో ప్రాబ్లెమ్' అంటూ లైట్ తీసుకున్నాడు తేజు. నో ప్రాబ్లెమ్ చెప్పేసి అటు తిరిగేసింది రకుల్ ప్రీత్. మరి వీరిద్దరూ కెమేరా ముందు అంతగా రొమాన్స్ ఎలా పండిచేశారబ్బా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/