Begin typing your search above and press return to search.

ఫ్యాక్చర్ కాదు జస్ట్ బెణుకు మాత్రమేనట

By:  Tupaki Desk   |   21 Oct 2016 5:16 PM GMT
ఫ్యాక్చర్ కాదు జస్ట్ బెణుకు మాత్రమేనట
X
ఈ మధ్యన టాలీవుడ్ నటులు పలువురు గాయాలపాలవుతున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో వారుచేస్తున్న పోరాటాలతో గాయాలవుతున్నా.. కమిట్ మెంట్ తో పని చేస్తున్నారే కానీ.. వెనక్కి తగ్గటం లేదు.ఈ మధ్యనే షూటింగ్ లో కాలికిఫ్యాక్చర్ కావటంతో వరుణ్ తేజ్ ఇంటికే పరిమితం కావటం.. మొన్నామధ్య థర్టీ ఇయర్స్ పృధ్వీ యాక్షన్ సన్నివేశంలో గాయపడటం లాంటివి వింటున్నాం.

తాజాగా ఆ జాబితాలో మల్లె మొగ్గలా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరిపోయింది. తాజాగా ఎఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు సరసన ఒక చిత్రంలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్ ఒకటి షూట్ చేస్తుండగా.. రకుల్ గాయపడింది. అయితే..ఆమెకు ఫ్యాక్చర్ అయ్యిందంటూ వార్తలు రావటంతో ..ఆమెను పరామర్శించేవారి జాబితా పెరిగిపోతుందట.

దీంతో.. ఆమె కంగారు పడి సోషల్ మీడియాలోకి వచ్చేసింది. మొదట అందరికి థ్యాంక్స్ చెప్పిన ఆమె.. అందరూ అనుకున్నట్లు తనకు ఫ్యాక్చర్ కాలేదని.. జస్ట్ బెణికిందని చెప్పింది. ‘‘షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు.. వేలు బెణికింది. అంతేతప్ప.. ఎలాంటి పెద్ద గాయం కాలేదు. మీ అభిమానానికి థ్యాంక్స్’’ అని చెప్పేసింది. రకుల్ కు షూటింగ్ లో పెద్ద గాయమైందని కంగారు పడుతున్న వారికి ఆమె ఇచ్చిన క్లారిటీతో కంగారు తగ్గటం ఖాయం.