Begin typing your search above and press return to search.

దీన్నే రకుల్ మార్క్ బిస్కెట్ అంటారు

By:  Tupaki Desk   |   16 March 2018 5:18 PM GMT
దీన్నే రకుల్ మార్క్ బిస్కెట్ అంటారు
X
మొన్నటి వరకు టాలీవూడ్ లో చక్రం తిప్పిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య బాలీవుడ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. గత కొంత కాలంగా చెప్పుకోదగ్గ విజయాలు లేకపోవడంతో బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయని క్రేజ్ ని కాపాడుకుంటోంది. కొన్ని రోజుల క్రితం ఆమె నటించిన బాలీవుడ్ సినిమా అయ్యారి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు గాని రకుల్ కి మంచి గుర్తింపు దక్కింది.

అందువల్లే మరో ఆఫర్ ని కూడా అందుకుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. అజయ్ దేవగన్ లేటెస్ట్ ఫిల్మ్ రెయిడ్ చాలా బోరింగ్ గా ఉందని ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే.. రకుల్ మాత్రం సినిమా సుపర్బ్ అంటోంది. అంతే కాకుండా సినిమా చూస్తే అవినీతిని నిర్మూలించవచ్చనే ఆలోచన వస్తుందని సినిమాలో ప్రతి సన్నివేశం బాగా చూపించారు అంటూ.. మార్పు అనేది మన నుంచి స్టార్ట్ అవ్వాలి. వెళ్లి సినిమా చూడండని రకుల్ సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేసింది.

రకుల్ అలా ఎందుకు కామెంట్ చేసిందో ఇప్పటికే మీకు అనుమానం వచ్చి ఉంటుంది. ఆమె చేసిన కామెంట్స్ ని చూసి చాలా మంది రకుల్ మార్క్ బిస్కెట్ అంటే ఇదేనేమో అని కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ అమ్మడు అజయ్ తో ఒక సినిమా చేయబోతోంది. అందువల్లే నెగిటివ్ కామెంట్స్ వస్తోన్న సినిమా కోసం పానీటివ్ గా కామెంట్ చేసింది. మరికొన్ని రోజుల్లో అజయ్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.