మంచు లక్ష్మి కోసం రకుల్ ఫిదా

Thu Oct 12 2017 23:46:05 GMT+0530 (IST)

టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫిదా చేసేయబోతోంది. ఆల్రెడీ ఫిదా మూవీతో సాయి పల్లవి టాలీవుడ్ జనాలను ఫిదా చేసేసింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ మళ్లీ ఎలా అంటే.. ఓ టెలివిజన్ ఎపిసోడ్ తో ఫిదా చేస్తోంది రకుల్. ఫిదా టైటిల్ పై ఇప్పుడు ఓ తెలుగు ఛానల్ టీవీ షో నిర్వహిస్తుండగా.. దీని తొలి ఎపిసోడ్ ను రకుల్ పైనే తెరకెక్కించారు.ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్ తో.. అంటూ జెమినీ టీవీ ప్రతీ ఆదివారం సాయంత్రం టెలికాస్ట్ చేయనున్న ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ రకుల్ ప్రీత్ తో మొదలుపెట్టడం మాత్రమే కాదు. అఆ మూవీ.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోతో తెలుగు జనాలను తెగ మెప్పించేసిన హరితేజ యాంకరింగ్ చేసేయడం. ఈ భామకు బుల్లితెర నుంచి విపరీతమైన డిమాండ్ నెలకొనగా.. ఇప్పుడు తన తొలి షోగా ఫిదా అంటూ.. స్టార్లతో ఓ రోజు మొత్తం గడిపితే అనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమం రూపొందింది.

తాజాగా మంచు లక్ష్మి ఈ కార్యక్రమం టీజర్ ను రిలీజ్ చేస్తూ.. రకుల్ ప్రీత్ సింగ్ కు బెస్ట్ విషెస్ చెప్పింది. రకుల్ ని హరితేజ బాగానే హ్యాండిల్ చేసినట్లుగా కనిపిస్తోంది. రకుల్ ప్రీత్ కూడా ఓపెన్ గా బాగానే సమాధానాలను ఇచ్చింది. క్వశ్చన్ ఏంటో చెప్పలేదు కానీ.. చరణ్.. బన్నీ.. తారక్.. అంటూ రకుల్ ఏ పేరు చెప్పాలో తెలీక తల పట్టేసుకుందంటే.. హరితేజ టఫ్ క్వశ్చన్ నే వేసినట్లుగా ఉంది.