Begin typing your search above and press return to search.

స్టార్ రకుల్.. రెండున్నరకి వచ్చేసింది

By:  Tupaki Desk   |   26 Sep 2017 5:32 AM GMT
స్టార్ రకుల్.. రెండున్నరకి వచ్చేసింది
X
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలతో దూసుకుపోతూనే ఉంది. గత రెండేళ్ల హిస్టరీ బయటకు తీస్తే.. అమ్మడి ఖాతాలో విన్నర్ మూవీ ఒక్కటి మినహాయిస్తే.. అసలు ఫ్లాప్ అనే మాటే లేదు. పైగా పలు చిత్రాలలో తన గ్లామర్ తో మెప్పించిన ఈ బ్యూటీ.. మరికొన్ని చిత్రాలలో పెర్ఫామెన్స్ తో ఇరగదీసేసింది. ఇప్పుడు మహేష్ బాబు మూవీ స్పైడర్ తో మరో మెట్టు ఎక్కేసింది రకుల్.

ఇటు తెలుగులోను.. అటు తమిళ్ లోనూ ఒకే భారీ చిత్రంతో సత్తా చాటే అరుదైన అవకాశం రకుల్ ప్రీత్ కు వచ్చింది. ఇప్పటివరకూ తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామకు.. ఇప్పుడు తమిళ్ నుంచి కూడా బోలెడన్ని పిలుపులు వస్తున్నాయట. అమ్మడి అందానికి ట్యాలెంట్ కు ముగ్ధులు అయిన కోలీవుడ్ మూవీ మేకర్స్.. అడిగినంత పారితోషికం ఇవ్వడానికి సై అంటున్నారని తెలుస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. డిమాండ్ ఉండగానే డబ్బులు వసూలు చేసుకోవాలి. ఈ విషయం సినిమా జనాలకు బాగానే తెలుసు. అందుకే సడెన్ గా రెమ్యూనరేషన్ ను రెండున్నర కోట్లకు రకుల్ ప్రీత్ పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి గత కొన్నాళ్లుగా రకుల్ కొత్త సినిమాలు సైన్ చేయడం లేదు. స్పైడర్ రిలీజ్ వరకూ ఆగి అప్పుడు పారితోషికం విషయంలో డెసిషన్ తీసుకోవాలన్నది అమ్మడి ఆలోచన. ఇప్పటికే స్పైడర్ ట్రెండ్ గురించి ఫుల్ పాజిటివ్ బజ్ వచ్చేసింది. అందుకే తన మనసులోని రెండున్నర కోట్ల మాటను.. ఇలా మెల్లమెల్లగా బయటపెడుతోందట. ఇప్పటివరకూ కోటిన్నరకు అటూఇటూగా తీసుకునే రకుల్ ని ఇప్పుడు మూవీలోకి తీసుకోవాలంటే.. నిర్మాతలు రెండున్నర కోట్లు చదివించుకోవాల్సిందే.