Begin typing your search above and press return to search.

రకుల్ ప్రీత్ పొలిటికల్ ఎంట్రీ..

By:  Tupaki Desk   |   7 Oct 2015 11:27 AM GMT
రకుల్ ప్రీత్ పొలిటికల్ ఎంట్రీ..
X
హెడింగ్ చూసి రకుల్ ప్రీత్ సింగ్ పాలిటిక్స్ లోకి వచ్చేస్తోందా అనే ఆలోచనకు రాకండి. ఈ పొలిటికల్ ఎంట్రీ కూడా సినిమాలకు సంబంధించినదే. కెరీర్ ఇప్పుడే ఊపందుకుంటున్న స్టేజ్ లో... ఎమ్మెల్యే కేరక్టర్ చేసే ఛాన్స్ దక్కించుకుంది రకుల్. అది కూడా ఓ భారీ చిత్రంలో కావడం విశేషం.

బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పవర్ ప్యాక్డ్ రొమాంటిక్ ఎంటర్టెయినర్ లో.. రకుల్ ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ కేరక్టర్ చేస్తోందట. చిన్న చిత్రాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ పంజాబీ పాప.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఫాంలోకి వచ్చింది. తర్వాత మాస్ మహరాజా రవితేజ మాత్రం కిక్ ఇవ్వలేకపోయాడు. దసరాకి రానున్న బ్రూస్ లీలో చెర్రీ పక్కన ఆడిపాడుతున్న రకుల్.. ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ తర్వాత రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ మూవీ. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ మూవీలో.. ఖద్దరు దుస్తుల్లో దర్శనమివ్వబోతోందన్న మాట.

హీరోలు రాజకీయ నాయకులుగా చేయడం కామనే కానీ.. హీరోయిన్స్ ఇలా పొలిటికల్ లీడర్స్ గా చేయడం అరుదుగా జరిగే విషయమే. అలాంటి అరుదైన ఛాన్స్ దక్కించుకున్న క్రెడిట్ పట్టేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు ఈభామ కెరీర్ కీలకమైన స్టేజ్ లో ఉంది. ఈ టైంలో గ్లామర్ మాత్రమే కాకుండా... పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ కేరక్టర్స్ రావడం.. అదృష్టమే. ఈ ఛాన్స్ ఎంతవరకూ నిలబెట్టుకుంటుందో చూద్దాం.