ఫిదా బ్యూటీతో రకుల్ పోటీనా

Tue Dec 12 2017 23:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ లో హీరోయిన్స్ సక్సెస్ రేషియో హై లెవెల్ లో ఉంటే వారు షూటింగ్ లతో తప్ప మరెక్కడా కనిపించరు. నిత్యం ఎదో ఒక సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటారు. నెక్స్ట్ సినిమా కోసం బడా నిర్మాతలు దర్శకులు కూడా వారి డేట్స్ కోసం చాలా ఎదురు చూస్తుంటారు. కానీ ఒక రెండు డిజాస్టర్స్ అందితే మాత్రం ముందు ఒకే చేసిన సినిమాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ తరహా అనుభవాలు ప్రతి హీరోయిన్ ఎప్పుడో ఒకపుడు ఎదుర్కోవాల్సిందే!ఇకపోతే ఈ ఏడాది మొదటి వరకు వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ సడన్ గా డౌన్ అయిపొయింది. పెద్ద సినిమాలే ఆమెకు ఊహించని విధంగా డిజాస్టర్స్ ని ఇచ్చాయి. ముఖ్యంగా స్పైడర్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ సినిమా అపజయాన్ని ఇచ్చింది. అంతే కాకుండా ఆమె పాత్ర పై అనేక నెగిటివ్ సెటైర్లు కూడా వచ్చాయి. ఇక జయ జానకి నాయక సినిమా కూడా ఏ మాత్రం లాభాన్ని అందించలేదు. అయితే రీసెంట్ గా ఖాకి సినిమాతో మళ్లీ ఈ బ్యూటీ రికవర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.

కానీ ఇంతవరకు అమ్మడు ఒక తెలుగు సినిమాను కూడా ఒకే చేసినట్లు అధికారికంగా చెప్పలేదు. నెక్స్ట్ బోయపాటి - రామ్ చరన్ సినిమాలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే హరీష్ శంకర్ మల్టి స్టారర్ కథలో కూడా ఒకే అయ్యిందని వార్తలు వెలువడుతున్నాయి. నితిన్ - శర్వానంద్ అందులో హీరోలు మరి అమ్మడిని ఎవరికీ సెట్ చేస్తారో చూడాలి. ఇక మరో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నట్లు సమాచారం. మరి రకుల్ ఫిదా బ్యూటీ ముందు సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.