Begin typing your search above and press return to search.

బాబు ఫ్యామిలీ తో రకుల్

By:  Tupaki Desk   |   18 March 2018 12:51 PM GMT
బాబు ఫ్యామిలీ తో రకుల్
X
అదేంటి రకుల్ ప్రీత్ సింగ్ బాబు ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళింది అని ఆశ్చర్యపోకండి. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి మంచు ఫ్యామిలీతో కలిసి రకుల్ వెళ్ళడం అక్కడున్న పబ్లిక్ ని బాగా ఆకట్టుకుంది. రకుల్ గత ఏడాది కూడా మంచు ఫ్యామిలీతో కలిసే వెళ్ళింది. వీలు కుదిరినప్పుడు మోహన్ బాబు సకుటుంబ సపరివార సమేతంగా ఏడుకొండల వాడి దర్శనానికి వెళ్ళడం సహజమే. ఈసారి కూడా మళ్ళి రకుల్ తోడవ్వడమే స్పెషల్. విష్ణు తో కాని మనోజ్ తో కాని కొత్త సినిమా ఏదైనా ప్లాన్ ఉందేమో కాని రకుల్ మాత్రం మంచి హుషారుగా కనిపించింది.

ఇటీవలే తన వంశానికి మూడో తరం వారసుడిని అందించిన విష్ణుతో పాటు కృతజ్ఞతలు తెలపడానికి మంచు ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టు కనిపిస్తోంది. మంచు లక్ష్మి - రకుల్ చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ కబుర్లు చెప్పుకోవడం మీడియా దృష్టి దాటి పోలేదు. ఇటీవలే గాయత్రితో కం బ్యాక్ ఇద్దాం అనుకున్న మోహన్ బాబు ఆశలను దాని ఫలితం నిరాశ కలిగించింది. మరోవైపు మనోజ్ కెరీర్ గ్రాఫ్ బాగా డౌన్ లో ఉంది. విష్ణు పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఆచారి అమెరికా యాత్ర వాయిదా పడుతూ ఇప్పటికి ఒక డేట్ సెట్ చేసుకుంది. కుటుంబ పరంగా హ్యాపీగా ఉన్న మంచు ఫ్యామిలీకి సినిమాల ఫలితాలు మాత్రం నిరాశ కలిగిస్తున్నాయి. పనిలో పని మనవడి థాంక్స్ తో పాటు కెరీర్లు కూడా సెట్ చేయమని వేడుకున్నారేమో.