Begin typing your search above and press return to search.

జిమ్ సెంటర్ లో జిల్ జిల్ రకుల్

By:  Tupaki Desk   |   13 Feb 2016 3:49 AM GMT
జిమ్ సెంటర్ లో జిల్ జిల్ రకుల్
X
ఒక తరం వెనక హీరోయిన్స్ అంటే అందంగా కనిపిస్తే చాలు అన్నట్లుగా ఉండేవారు. కానీ ఇప్పుడు అందంతో పాటు ఫిట్ నెస్ కూడా చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. డ్యాన్సులు - ఫైట్లు - బికినీలు.. ఇలా ఒక్కోదానికీ ఒక్కొక్కరు అన్నట్లుగా ఉండే రోజులు పోయి.. ఇప్పటి భామలు అన్నింటిలోనూ అదరగొట్టేస్తున్నారు. ఈ కాలం హీరోయిన్లలో సమంత - శృతిహాసన్ - రకుల్ ప్రీత్ సింగ్.. ఇందుకోసం జిమ్ సెంటర్ల కోసం బోలెడంత టైం కేటాయిస్తున్నారు.

ముఖ్యంగా కార్డియో ఎక్సర్ సైజుల విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇందుకోసం ప్రత్యేకమైన ఎక్విప్ మెంట్ తో సాధన చేసేస్తున్నారు. సుకుమారంగా మల్లెపువ్వుల్లా కనిపించే ఈ సుందరాంగులు.. వంద కిలోల వెయిట్ లిఫ్టింగ్ ని కూడా అవలీలగా ఎత్తేసేంత ఫిట్ గా ఉంటున్నారంటే.. దీనికి కారణం సరైన వర్కవుట్సే. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఎఫ్45 అనే ఓ కార్డియో ట్రైనింగ్ సెంటర్ ని ఓపెన్ చేస్తోంది.

ఈ సెంటర్ కోసం ప్రత్యేకంగా రకుల్ పై షూట్ చేసిన ఓ వన్ మినిట్ యాడ్ ని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఇంతగా ఒక జిమ్ సెంటర్ యాడ్ రకుల్ లాంటి టాప్ లీగ్ హీరోయిన్ ఎందుకు చేసిందా అంటే.. అసలు విషయం అప్పుడు తెలిసింది. ఆ కార్డియో సెంటర్ రకుల్ ప్రీత్ సింగ్ దే నట. ఈ నెల 20న హైద్రాబాద్ గచ్చిబౌలీలో దీన్ని లాంఛ్ చేయనున్నారు. మరి రకుల్ ఇచ్చే ట్రైనింగ్ ఎవరెవరు తీసుకుంటారో?