ఆ హీరో కోసం రకుల్ ముద్దు రెడీ

Fri May 19 2017 16:07:56 GMT+0530 (IST)

మనకు నచ్చిన వాళ్ళిని మనం ముద్దు పెట్టుకోవాలి అనుకోవడం సహజం. ముద్దు మన ప్రేమను చూపే ఒక స్పర్శ. ఎవ్వరైనా మనకు నచ్చితే నువ్వు భలే ముద్దుగా ఉన్నావే అని కూడా మాటల్లో వాడతాం. అంతటి ప్రేమ ఉంది ఈ ముద్దులో. అలానే మనకు చాలా మంది నటులు అంటే ఇష్టం ఉంటుంది వాళ్ళిని కలవాలిని అనుకుంటాం. బాగా పిచ్చి అభిమానం ఉంటే గట్టిగా వాటేసుకొని ముద్దు పెట్టాలి అనికూడా అనిపిస్తుంది. కాని అలా చేస్తే లీగల్ ట్రబుల్స్ వస్తాయండోయ్.

అయితే మనకే కాదు మన స్టార్స్ కూడా అలానే అనిపిస్తుంది. వాళ్ళు కూడా సినిమాలు చూసే పెరిగి ఉంటారు కదా. వాళ్ళకి కూడా ఎవరో ఒకరి పై ఆరాధన ఉంటుంది. అది హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు ఆరాధనకు జెండర్ తో సంబంధం లేదులే. ఇప్పుడు తెలుగులో ఒక స్టార్ హీరోయిన్ తనకు బాగా ఇష్టమైన రణవీర్ సింగ్ ను కుదురితే ముద్దు పెట్టుకోవాలిని ఉంది అని చెప్పింది. రకుల్ ప్రీత్ సింగ్ కు రణవీర్ అంటే పిచ్చి అని చెబుతుంది. రణవీర్ నా కలల రాకుమారుడు ఎప్పుడైనా అతనితో డేట్ కి వెళ్లాలిని ఉంది అని చాలా ఆశగా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో.

మరి రణవీర్ కి ఇది తెలిస్తే రకుల్ తో డేట్ కి వెళతాడో లేక దీపికాను అడిగి చెబుతాను అంటాడో. ఇలాంటి కోరికలు ఎప్పుడు కోరికలుగానే మిగిలిపోతాయి లెండి. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తాజా చిత్రం రారాండోయి వేడుక చూద్దాం విడుదలకి సిద్దంగా ఉంది. ఈ సినిమా లో ఈ అమ్మడు చలాకీగా చిలిపిగా కనిపిస్తుంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/