Begin typing your search above and press return to search.

రకుల్ పాప.. అక్కడ కూడా మొదలెడుతుందట

By:  Tupaki Desk   |   19 Feb 2017 9:55 AM GMT
రకుల్ పాప.. అక్కడ కూడా మొదలెడుతుందట
X
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. వరుస విజయాలు.. బ్లాక్ బస్టర్లు ఈ భామ డిమాండ్ ను తారా స్థాయికి చేర్చేశాయి. వరుసగా సినిమాలు రిలీజ్ చేసేస్తూ ప్లానింగ్ విషయంలో కూడా ఈ భామ బాగా దిట్ట అనిపించేసుకుంటోంది.

సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ రకుల్ ప్రీత్ ప్లానింగ్ కేక అనాల్సిందే. ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు వ్యాపారాలు కూడా చేసేస్తూ ఉంటుంది. ఇప్పటికే హైద్రాబాద్ లో ఈమెకు ఓ జిమ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటిదే ఒకటి బ్యాంకాక్ లో కూడా స్టార్ట్ చేసేస్తుందట. రకుల్ సోదరుడు ఈ బిజినెస్ లను హ్యాండిల్ చేస్తుంటాడు. కేవలం ఒక్క జిమ్ సెంటర్ ని మాత్రమే కాదు.. రెస్టారెంట్స్ కూడా మొదలుపెట్టబోతోందట రకుల్ ప్రీత్.

ఈ జిమ్.. రెస్టారెంట్లను ఓ చైన్ బిజినెస్ మోడల్ లో రన్ చేసేందుకు తగిన ప్లానింగ్ ఇప్పటికే చేసేసుకుందట ఈ టాలీవుడ్ బ్యూటీ. విన్నర్ మూవీలో సాయిధరం తేజ్ తో ఆడిపాడగా.. ఆ చిత్రం ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. అయితే ప్లానింగ్ లో మాత్రం రకుల్ రియల్ లైఫ్ లో కూడా విన్నర్ అనే చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/