రకుల్ ఫిట్ నెస్ సీక్రెట్ ఈయనే

Fri Sep 21 2018 18:36:50 GMT+0530 (IST)

ఇనుములో ఒక హృదయం మొలిచెనే.. ముద్దిమ్మంటూ నన్నే పిలిచెనే.. అంటూ `రోబో` కోసం లిరిక్ రాశాడో ప్రఖ్యాత లిరిసిస్ట్. పూజించే యంత్రుడా.. అంటూ అద్భుతమైన పదజాలం ఉపయోగించాడు. రోబోలోని ఈ పాటను ఇప్పుడు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రకుల్ ప్రీత్ కి అన్వయించాల్సి వస్తోంది. రకుల్ ఉన్నట్టుండి ఇనుములా మారుతోంది. ఇనప కడ్డీని తలపిస్తోంది. కండలు పెంచి కొత్త రూపుతో కనిపిస్తోంది.ఇదిగో ఇలా జిమ్ముల్లో కండలు కరగదీస్తూ గుండెలు తీసిన బంటులా తయారవుతూ అందరికీ షాకిస్తోంది. అయితే రకుల్ ఈ కఠోర శ్రమ వెనక డాడ్ రాజేందర్ సింగ్ ప్రోద్బలం కూడా ఉందని ఇదిగో తాజాగా రివీల్ చేసిన ఈ ఫోటో వల్ల తెలుస్తోంది. డాడీ - తన పర్సనల్ జిమ్ ట్రైనర్ తో రకుల్ ఇలా ఫోజు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో ట్విట్టర్ లో జోరుగా వైరల్ అవుతోంది.

అన్నట్టు రకుల్ ఇప్పటికే `ఎఫ్ 45 ఫ్రాంఛైజీస్` పేరుతో ఫిట్ నెస్ జిమ్ ల వ్యాపారంలో ఎంటర్ ప్రెన్యూర్ గా దూసుకుపోతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా జిమ్ లు ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు రకుల్ జిమ్ములు పాపులర్. మునుముందు ఇతర రాష్ట్రాల్లోని అన్ని నగరాలకు విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఇకపోతే కెరీర్ పరంగా చూస్తే రకుల్ ప్రస్తుతం `ఎన్టీఆర్` బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటిస్తోంది. సూర్య- ఎన్ జీకే - కార్తీ 17 - శివకార్తికేయన్ సినిమాల్లో నటిస్తూ తమిళంలో బిజీగా ఉంది. అలానే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన ఓ సినిమాకి సంతకం చేసింది.