Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బ‌యోపిక్ కు మ‌రో అట్రాక్ష‌న్‌!

By:  Tupaki Desk   |   11 July 2018 4:30 AM GMT
ఎన్టీఆర్ బ‌యోపిక్ కు మ‌రో అట్రాక్ష‌న్‌!
X
తెలుగోళ్ల ఉనికిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన ఎన్టీవోడి బ‌యోపిక్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్టు మీద అంచ‌నాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ మూవీ క్రిష్ చేతికి వ‌చ్చిందో.. స్క్రిప్ట్ నుంచి ప్ర‌తి ఒక్క‌టి మారిపోతున్నాయి. కొత్త అట్రాక్ష‌న్స్ యాడ్ అవుతూ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే బాల‌య్య‌తో పాటు రానా.. విద్యాబాల‌న్‌.. కీర్తి సురేష్‌.. మోహ‌న్ బాబు లాంటి న‌టుల‌తో ఇదో గ్రాండ్ మూవీగా మారింది.

ఈ సినిమాలో క‌ల్యాణ్ రామ్ కూడా ఉంటార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ మూవీలో పాలు పంచుకోనున్నట్లు చెబుతున్నారు. యూత్ లో మాంచి క్రేజ్ ఉన్న ర‌కుల్ ఈ సినిమాలో ఏ పాత్ర‌ను పోషించ‌నున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. స‌నిమాలో సంద‌ర్భానుసారంగా వ‌చ్చే ఒక పాట‌లో ఆమె త‌ళుక్కుమంటార‌ని చెబుతున్నారు. అయితే.. ఏ పాట‌లో క‌నిపించ‌నున్నారు? ఎన్టీఆర్ న‌టించిన ఏ సినిమాకు సంబంధించిన‌దన్న‌ది ఇంకా రివీల్ చేయ‌లేదు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వీరితో పాటు బాల‌య్య కుమారుడు.. ఎన్టీఆర్ మ‌న‌మ‌డు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని చెబుతున్నా.. అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. మ‌రోవైపు మోక్షజ్ఞ న‌టించే అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఫిజిక‌ల్ ఫిట్ నెస్ ప‌ని మీద సింగ‌పూర్ వెళ్లిన మోక్షజ్ఞ అక్క‌డ నుంచి వ‌చ్చే దానిపై క్లారిటీ లేదు. అందువ‌ల్ల ఈ ప్రాజెక్టులో అత‌డి ఎంట్రీ ఎంత‌వ‌ర‌కు అన్న‌ది ప్ర‌శ్న‌గా ఉంది. ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో మ‌రింత స్టార్ కాస్ట్ ఈ మూవీలో పాలు పంచుకోవ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.