ఫోటో టాక్: రత్తాలు చెల్లి రత్తమ్మవా?

Sat May 18 2019 11:29:22 GMT+0530 (IST)

`సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ పాలసీ` అంటారు. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లో రకుల్ సింప్లిసిటీ ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మారిన ట్రెండ్ కి తగ్గట్టే తనని తాను ఎలివేట్ చేసుకుంటోంది. రోమ్ వెళితే రోమన్ లా ఉండాలన్న సూత్రాన్ని పీసీ లాంటి యూనివర్శల్ స్టార్ ప్రతిచోటా అనుసరిస్తోంది. ఇప్పుడు అదే బాటలో రకుల్ సైతం మారిపోయింది. ఇటీవలే కొంత గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తూ కిలాడీ సరసన `దేదే ప్యార్ దే` చిత్రంలో నటించింది.  ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు రాగా.. రకుల్ లుక్ గురించి ఇటు సౌత్ లో ఆసక్తికర చర్చ సాగింది.ఉత్తరాది ఆడియెన్ విషయంలో రూల్స్ చెరిపేసి ఈ అమ్మడు దేదే ప్యార్ దేలో చెలరేగిన తీరు గురించి యూత్ లో వాడి వేడి చర్చ సాగింది. రకుల్ ఆల్మోస్ట్ ఈ సినిమా ఆద్యంతం గ్లామర్ ఎలివేషన్ పై ఏ రేంజులో దృష్టి సారించిందో అంటూ మాట్లాడుకుంటున్నారంతా. ప్రేక్షకుల్ని బట్టి డోస్ పెంచాలని అనుకుందా లేక సౌత్ లో ఇంతవరకే  చూపించాలన్న లిమిటేషన్ పెట్టుకుందా? అంటూ సౌత్ ఫ్యాన్స్ చిన్నబుచ్చుకున్నారు. రత్తాలు అంత  హాట్ గా మ్యాటర్ ఉన్నా.. రత్తాలు సిస్టర్ రత్తమ్మలా కాస్త కామ్ గా ఉంటోందే అంటూ కామెంట్లు రువ్వుతున్నారు.

అదంతా సరే  `దేదే ప్యార్ దే` ప్రమోషన్స్ లో రకుల్ లుక్ మరింత బిగ్ సర్ ప్రైజ్. రొటీన్ కి భిన్నంగా సింపుల్ గా కనిపించిన తీరు గురించిన ముచ్చటా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల ప్రచార కార్యక్రమంలో రకుల్ సింపుల్ లుక్ తో ఆకట్టుకుంది. డార్క్ బ్లూ రబ్ డ్ యాష్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఎలాంటి అనవసర హంగామా లేకుండా కనిపించింది. ఆ డ్రెస్ కి కాంబినేషన్ గా చెవికి వేలాడుతున్న జూకాలు అదే కలర్ తో ఇంప్రెస్సివ్ గా కనిపించాయి. సింపుల్ స్మైల్ ఇస్తూ కుర్రాళ్ల గుండెల్ని టచ్ చేసింది. మొత్తానికి సందర్భాన్ని బట్టి తాట తీయడం ఈ పంజాబీ బ్యూటీకి వెన్నతో పెట్టిన విద్య అని అర్థమవుతోంది. ఇక మునుపటి లుక్ తో పోలిస్తే రకుల్ ఎంతో స్లిమ్ అయ్యి కనిపిస్తోంది. మునుముందు బాలీవుడ్ లో సెటిలైపోయే ఆలోచన ఏదైనా ఉందా? అన్నది తేలాల్సి ఉంది.