Begin typing your search above and press return to search.

ఇంత 'బ్యాక్‌' గ్రౌండ్ ఉందా?

By:  Tupaki Desk   |   18 Nov 2018 3:30 AM GMT
ఇంత బ్యాక్‌ గ్రౌండ్ ఉందా?
X
వీపు చూడు వీపందం చూడు! అంతందంగా క‌వ్విస్తే అటువైపు చూడ‌కుండా ఉండ‌గ‌ల‌రా? ఇంత‌కీ ఎవ‌రీ అందం.. లైట్ ఫోక‌స్‌లో లైట్‌గా సైడ్ క‌టింగ్ కొడుతోంది? .. ఈ లైటింగ్ బేబి పేరు ర‌కుల్ ప్రీత్ సింగ్. సౌత్ స్టార్ హీరోయిన్‌గా వెలుగులు విర‌జిమ్ముతున్న ఈ పంజాబీ బ్యూటీ ప్రస్తుతం కెరీర్ ప‌రంగా బిజీగానే ఉంది. రెండు త‌మిళ చిత్రాలు, ఒక తెలుగు సినిమా, ఇంకో బాలీవుడ్ సినిమా ఏక‌కాలంలో చేస్తోంది.

కెరీర్ ప‌రమైన బిజీలో ముంబై టు హైద‌రాబాద్, హైద‌రాబాద్ టు చెన్న‌య్ చ‌క్క‌ర్లు కొడుతూ అన్ని ప్రాజెక్టులు ఫినిష్ చేస్తోంది. ఇటీవ‌లే ఎన్టీఆర్ బ‌యోపిక్‌ లో శ్రీ‌దేవి పాత్ర కోసం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంది. అటు కోలీవుడ్‌లో అన్న‌ద‌మ్ములైన సూర్య‌ - కార్తీ ల‌తో సినిమాలు చేస్తోంది. అందుకోసం రెగ్యుల‌ర్‌గా చెన్న‌య్ కి ప‌య‌న‌మ‌వుతోంది. ఇంత బిజీలోనూ సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా అభిమానుల‌కు త‌న‌దైన శైలిలో ట్రీట్ ఇస్తూనే ఉంటోంది.

తాజాగా ర‌కుల్ ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో షేర్ చేసిన మేక‌ప్ రూమ్‌ ఫోటో యూత్ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. నూలు పోగైనా ఒంటిపై నిల‌వనంటోంది. అలా భుజాల పైనుంచి జారిపోతున్న ఈ డిజైన‌ర్ టాప్‌లో ర‌కుల్ వీపందం బ‌య‌ట‌ప‌డింది. వీపు చూడు వీపందం చూడు!! అంటూ గ‌మ్మ‌త్త‌యిన తీరుగ ఫోజిచ్చింది. అంత‌గా క‌వ్విస్తే నేటి త‌రం ఊరుకుంటుందా? ఆ ఫోటోని అంతే వేగంగా వైర‌ల్ చేస్తున్నారు. టీనేజీ బోయ్స్‌లో ఇంకా స్పీడ్‌గా దూసుకెళ్లిపోతోంది ఈ లుక్.