లండన్ లో రకుల్ షాపింగ్ ...వైరల్!

Sat Jul 14 2018 21:49:49 GMT+0530 (IST)

టాలీవుడ్ లో `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ `తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్.....అతి కొద్ది కాలంలో నే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా 3-4 సినిమాల్లో నటిస్తోందీ ముద్దుగుమ్మ. లవ్ రంజన్ తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన రకుల్ నటిస్తోంది. గత నెల రోజులుగా ఆ చిత్ర షూటింగ్ లండన్ లో జరుగుతోంది. అయితే షూటింగ్ కు కొద్దిగా విరామం దొరకడంతో...రకుల్ ఎంచక్కా లండన్ వీధుల్లో  షాపింగ్  చేసింది. తన తల్లితో కలిసి అక్కడి రెస్టారెంట్లు - షాపింగ్ మాల్స్ లో సందడి చేసింది. చాలా రోజుల తర్వాత అమ్మతో కలిసి టైం స్పెండ్ చేశానంటూ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఆ షాపింగ్ ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో బిజీగా ఉంది. ఆమె నటించిన కిక్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ పోషిస్తోన్న సిమ్లా మిర్చ్ చిత్రంలో ఓ విలక్షణమైన పాత్రలో రకుల్ నటిస్తోంది. ఈ చిత్రంలో రకుల్ తల్లి పాత్రలో హేమా మాలిని నటిస్తోంది. తల్లీ కూతుళ్లిద్దరూ ఒకే యువకుడిని ప్రేమించడం అనే రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. లండన్ లో అజయ్ దేవగన్ చిత్రం షూటింగ్ కు కొద్దిగా విరామం దొరకడంతో తన తల్లితో కలిసి రకుల్ షాపింగ్ చేసింది. ``చాలా రోజుల తర్వాత మమ్మీతో కలిసి ఓ రోజంతా గడిపాను. మమ్మీస్ డే అవుట్. ఇద్దరం కలిసి షాపింగ్ చేసి...రెస్టారెంట్లలో లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేశాం....``అని రకుల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ ఐటమ్ సాంగ్ కోసం...రకుల్ ను క్రిష్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.