Begin typing your search above and press return to search.

ఆ బొడ్డు రకుల్ ది కాదు తెలుసా?

By:  Tupaki Desk   |   29 July 2015 2:27 AM GMT


చాలా ఏళ్ల కిందట మనీషా కొయిరాలా బాలీవుడ్లో ‘ఏక్ ఛోటీసే లవ్ స్టోరీ’ అనే సినిమా ఒకటి చేసింది. ఆ సినిమా డైరెక్టర్ మనీషాతో షూటింగ్ అంతా మామూలుగానే చేశాడు కానీ.. ఫస్ట్ కాపీ చూసుకుంటే మాత్రం మనీషాకు దిమ్మదిరిగిపోయింది. వేరే అమ్మాయితో సెమీ న్యూడ్ గా కనిపించే దృశ్యాలు తీసి.. వాటిని సన్నివేశాల మధ్య అతికించేశాడు. సినిమా చూస్తే ఆ నగ్నత్వం కూడా తనదే అని ప్రేక్షకులు ఫిక్సవుతారని అర్థమైంది మనీషాకు. సినిమా విడుదల ఆపేయాలంటూ గొడవ గొడవ చేసింది మనీషా. వ్యవహారం కోర్టుకెళ్లి కొన్నేళ్ల పాటు సినిమా ఆగిపోయింది. చివరికి దర్శకుడితో కాంప్రమైజ్ అయి.. సినిమా విడుదల చేయడానికి ఒప్పుకుంది మనీషా.

ఐతే ఏక్ ఛోటీసే లవ్ స్టోరీలో కొంచెం బూతు ఎక్కువైంది కాబట్టి మనీషా గగ్గోలు పెట్టింది కానీ.. చాలా సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల కోసం ఇలా డూప్ అమ్మాయిల్ని వాడుకుంటారన్నది ప్రేక్షకులు తెలియదు. నడుం అందాలు, క్లీవేజ్ విషయంలో ఇలాంటి అతుకులు తరచుగా జరుగుతుంటాయి. ఐతే ‘కరెంటు తీగ’ సినిమాలో రకుల్ ప్రీత్ నడుముకు సంబంధించి తీసిన సీన్ కు సంబంధించి ఓ సినీ పిపాసి ఓ ఆసక్తికరమైన సంగతి చెప్పాడు. అదేంటంటే.. అర్ధరాత్రి రకుల్ ఇంటికెళ్లి మనోజ్ రొమాన్స్ చేసే సీన్లో ఆమె నడుం చూపిస్తారు. ఐతే నడుం రకుల్ దే కానీ.. అందులో కనిపించే బొడ్డు మాత్రం ఆమెది కాదట. ఆమె బొడ్డు అంత ఆకర్షణీయంగా లేదని.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ బొడ్డును కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా మిక్స్ చేసి చూపించారట. హీరోయిన్ల అందాల విషయంలో డైరెక్టర్లు ఎంత పర్టికులర్ గా ఉంటారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?