రకుల్ రింగ్ సెంటిమెంట్ విన్నారా!!

Thu Jun 14 2018 12:25:46 GMT+0530 (IST)

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా నమ్మకాలు ఉండడం సహజమే. ఎలాంటి వారైనా ముహూర్తాలను సెంటిమెంట్ లను చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతారు. కొందరికి పేర్లలో మార్పులు జరిగితే మరికొందరికి వస్త్రాభరణాలలో మార్పులు జరుగుతాయి. చాలా మంది హీరోయిన్స్ వారి పేర్లలో మార్పులు చేసుకున్న సంగతి సంగతి తెలిసిందే. న్యూమరాలజీ ప్రకారం అక్షరాలను కలుపుకోవడం అందరికి తెలిసిందే.ఇకపోతే రకుల్ ప్రీత్ కూడా కొంత సెంటిమెంట్ గర్ల్ అని అర్ధమవుతోంది. ఎంతగా ఫ్యాషన్ లైఫ్ లో గడిపినప్పటికీ అమ్మడు కనక పుష్య రాగం అనే స్టోన్ ఉన్న ఉంగరాన్ని రెగ్యులర్ గా వాడుతోంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నుంచి అమ్మడి సెంటిమెంట్ మరి ఎక్కువయ్యింది. అందుకే ఎలా కనిపించినా పర్లేదు గాని ఉంగరం లేకుండా ఉండలేను అంటోంది. ప్రముఖ మ్యాగజైన్ లకు ఇచ్చిన ఫోటోలకు కూడా ఉంగరాన్ని చూపుడు వేలి నుంచి అస్సలు తీయడం లేదు.

చివరగా వచ్చిన జయ జానకి నాయక సినిమాలో కూడా రకుల్ అదృష్టం కలిసొస్తున్న ఉంగరాన్ని వదల్లేదు. సాధారణంగా ఫోటో షూట్స్ అంటే కొన్ని సార్లు ఉంగరాలు తీసేయాల్సి ఉంటుంది. కానీ రకుల్ తన సెంటిమెంట్ ను కాదనడం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో అజయ్ దేవా గన్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.