Begin typing your search above and press return to search.

రకుల్‌ కు సినిమా ఇచ్చేదెవరమ్మా?

By:  Tupaki Desk   |   10 Oct 2015 1:30 PM GMT
రకుల్‌ కు సినిమా ఇచ్చేదెవరమ్మా?
X
మొన్నే కదమ్మాయ్‌ 80 లక్షలు అన్నావ్‌? అబ్బే లేదండీ ఇప్పుడు కోటి.. మొన్నే కదమ్మాయ్‌ 1 కోటి అన్నావ్‌..? అబ్బే లేదు సార్‌.. ఇప్పుడు కోటిన్నర.. సరిగ్గా సెక్సిణి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తంతు ఇలాగే ఉంది. అమ్మడు బ్రూస్‌ లీ ట్రైలర్లలో బాగా హాటుగా కనిపించింది.. వాటే స్టార్‌ మెటీరియల్‌ అని టాక్‌ రాగానే అమాంతం 1.5 కోటి అడగటం మొదలెట్టేసింది. కాని కొత్త సినిమా ఒక్కటి కూడా సైన్‌ చేయలేదు. ఇక్కడే ఓ విషయం గమనించాలి మనం.

ప్రస్తుతం సుకుమార్‌ డైరక్షన్‌లో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న ''నాన్నకు ప్రేమతో''.. అలాగే బోయపాటి శ్రీను తొలిసారిగా బన్నీతో తీస్తున్న ''సరైనోడు'' సినిమా తప్పిస్తే.. అలసు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేతిలో ఇంకో సినిమాయే లేదు. మరి ఈ రెండు ఎప్పుడో సైన్‌ చేసింది కాబట్టి.. వాటికి కోటిన్నర ముట్టే ఛాన్సే లేదులే. అయితే కొత్తగా కోటిన్నర ఇస్తున్న ఆ మహానుభావులూ ఎవరు అని ఒకసారి ఆరా తీస్తే.. అసలు ఎవరూ లేరట. స్టార్లలో మహేష్‌ ఆల్రెడీ బిజీ.. బ్రహ్మోత్సవం పూర్తయితే కాని కొత్త సినిమా పడదు. పవన్‌ ఆల్రెడీ కాజల్‌ ను తీసుకొని సర్దార్‌ షురూ చేశాడు. చెర్రీ సినిమా ఇప్పుడే అయ్యింది కాబట్టి.. తదుపరి సినిమాలో వెంటనే రకుల్‌ కష్టమే. ఇక ప్రభాస్‌ కొత్త సినిమా మొదలెట్టట్లేదు. ఇక నితిన్‌ కూడా సమంతతో చేసేస్తున్నాడు. నాని, గోపిచంద్‌, నిఖిల్‌, శర్వానంద్‌ మొదలగు హీరల సినిమాలకు రకుల్‌ సెట్టయినా ఆమెకు కోటి కోటిన్నర పెట్టే సీన్‌ అయితే ఉండదు. సో.. అసలు మన రకులమ్మకు సినిమా ఇచ్చే స్టార్‌ ఎవరబ్బా?

ఒకవేళ సడన్‌ గా మెగాస్టార్‌ 150వ సినిమాలో అమ్మడిని హీరోయిన్‌ అనాలేమో తప్పించి.. ఇప్పటికిప్పుడు రకుల్‌ ప్రీత్‌ ను 1.5 కోటి ఇచ్చి తీసుకునే స్టార్‌ హీరోలు ఎవ్వరూ లేరనే చెప్పాలి. పోనివ్‌ బ్రూస్‌ లీ ఎలాగో తమిళంలో కూడా రిలీజ్‌ అవుతోంది కాబట్టి.. ఆ సినిమా అక్కడ రిలీజ్‌ అవ్వగానే అటునుండి ఏదైనా ఆఫర్‌ వస్తుందేమో చూద్దాం.