Begin typing your search above and press return to search.

15 నిమిషాల డ్యాన్సుకు గట్టిగా ఇచ్చారు

By:  Tupaki Desk   |   16 Jun 2018 10:11 AM GMT
15 నిమిషాల డ్యాన్సుకు గట్టిగా ఇచ్చారు
X
ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ అంటేనే ఓ రేంజిలో ఉంటుంది. తారల మెరుపులు.. సెలబ్రిటీలు.. టాప్ హీరోయిన్ల ఆటాపాటాతో ఈ ఫంక్షన్ యమా గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఫంక్షన్ లో ఎంటర్ టెయిన్ మెంట్ ఈవెంట్ భాగంగా హీరోయిన్లతో డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. సాధారణంగా వీళ్లంతా టాప్ రేంజిలో ఉండే హీరోయిన్లతోనే ఈ ఈవెంట్ నిర్వహిస్తారు.

ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ ఫంక్షన్ జూన్ 16న హైదరాబాద్ లో జరగనుంది. దీనికి సౌత్ లోని నాలుగు భాషల నుంచి హీరోలు.. హీరోయిన్లు.. టెక్నీషియన్లు అటెండ్ అవుతారు. ఈసారి స్టేజ్ పై టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఆటాపాటతో మురిపించనుంది. బేసిగ్గా రకుల్ డ్యాన్స్ ఇంప్రెసివ్ గానే ఉంటుంది. ఈసారి తన మేని మెరుపుతో మరోసారి ప్రేక్షకులను మురిపించనుంది. మొత్తం 15 నిమిషాలపాటు రకుల్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తమే ముట్టజెబుతున్నారు. పావుగంట ఆడిపాడినందుకు దాదాపు రూ. 25 లక్షల వరకు ఆమెకు చెల్లిస్తున్నారని తెలిసింది. దాదాపుగా ఓ స్టార్ హీరోయిన్ రెమ్యునరేషన్ తో ఇది సమానం.

నిన్న మొన్నటివరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్టుండి డల్ అయిపోయింది. ఓవైపు కొత్తగా నార్త్ బ్యూటీలు రంగంలోకి దిగడం.. మరోవైపు కేరళ భామలు రేసులో దూసుకొస్తుండటంతో అమ్మడికి ఛాన్సులు తగ్గిపోయాయి. ఇదేటైంలో బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా అవేవీ పెద్దగా వర్కవుట్ అవలేదు.