Begin typing your search above and press return to search.

రకుల్ ఆఫర్ భలే ఉందే!

By:  Tupaki Desk   |   15 July 2018 6:24 AM GMT
రకుల్ ఆఫర్ భలే ఉందే!
X
నిన్న మొన్నటి దాకా అగ్ర హీరోయిన్ గా ఉండి ఒక్క సినిమా దెబ్బకు గ్రాఫ్ అమాంతం తగ్గిపోవడం టాలీవుడ్ లోనే కాదు హీరోయిన్ల విషయంలో ఎక్కడైనా మామూలే. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. యూత్ సీనియర్ అనే తేడా లేకుండా ప్రతి అగ్ర హీరో సరసన వరస బెట్టి ఛాన్సులు కొట్టేసిన రకుల్ స్పీడ్ స్పైడర్ తర్వాత అమాంతం పడిపోయింది. అసలు హీరోయిన్ ఉందా లేదా అనే రీతిలో మురుగదాస్ తన పాత్రను చిత్రీకరించిన తీరు సినిమా రిజల్ట్ తో పాటు రకుల్ మార్కెట్ ని కూడా కింద పడేసింది. దాస్ ఇంత పేలవంగా కథానాయిక పాత్ర చిత్రీకరించడం స్టాలిన్ తర్వాత స్పైడర్ లోనే. అందుకే బాలీవుడ్ లో ఫోకస్ పెట్టిన రకుల్ కు అక్కడ కూడా టైం ఏమంత కలిసి రావడం లేదు. చాలా హోప్స్ పెట్టుకుని బాగా పేరున్న నీరజ్ పాండే దర్శకత్వంలో ఆయారి చేస్తే అది కాస్త ఆయన కెరీర్లోనే ఫస్ట్ డిజాస్టర్ గా నమోదయ్యింది. దాని ప్రమోషన్ కోసం రకుల్ కష్టపడినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం అజయ్ దేవగన్ సరసన ఓ సినిమా చేస్తున్న రకూల్ చేతిలో ఓ తమిళ సినిమా కూడా ఉంది.

ఏవి ఎలా ఉన్నా తెలుగులో చేస్తే వచ్చే కిక్కే వేరు కనక నిర్మాతలను ఆకర్శించడం కోసం రకుల్ తన రెమ్యునరేషన్ తగ్గించుకుని ఆ మేరకు తన టీమ్ ద్వారా అందరికి తెలిసేలా చేస్తోందట. నిన్నటి దాకా 80 నుంచి 90 లక్షల దాకా డిమాండ్ చేసి మరీ తీసుకున్న రకుల్ ఇప్పుడు అందులో చెప్పుకోదగ్గ డిస్కౌంట్ ఇస్తోందని టాక్. కాకపోతే చిన్న మెలిక. పారితోషికం మీద కట్టాల్సిన జిఎస్టిని నిర్మాతే భరించాలి. అయినా ఒకరకంగా తగ్గించుకున్నట్టే అని చెప్పొచ్చు. రకుల్ ప్రస్తుతం వెంకటేష్-నాగ చైతన్య కాంబోలో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వెంకీ మామ(వర్కింగ్ టైటిల్)లో వెంకీ పక్కన నటిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా కీలక పాత్ర ఆఫర్ చేసారు అనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. దీంతో పాటు దిల్ రాజు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన మల్టీ స్టారర్ దాగుడు మూతలు కోసం రకుల్ ని ఎప్పుడో ఫిక్స్ చేసారు. కానీ షూటింగ్ ప్రారంభించడంలో ఆలస్యం జరుగుతోంది. మొత్తానికి మళ్ళి వేగం పెంచాలనుకుంటున్న రకుల్ చాలా తెలివిగా అడుగులు వేస్తోంది.