Begin typing your search above and press return to search.

మెగాస్టార్ టైమింగ్ కి మురిసిపోతోంది

By:  Tupaki Desk   |   9 Oct 2015 5:30 AM GMT
మెగాస్టార్ టైమింగ్ కి మురిసిపోతోంది
X
బ్రూస్ లీ ది ఫైటర్ రిలీజ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అక్టోబర్ 16న థియేటర్స్ లోకి రానున్న బ్రూస్ లీ.. తనను స్టార్ లీగ్ లోకి తీసుకెళ్తాడని చాలానే ఆశలు పెట్టుకుంది పంజాబీ సుందరి. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా మెగా పవర్ స్టార్ తోనే కానే కాకుండా.. మెగాస్టార్ తో చేసే అవకాశాన్ని కూడా దక్కించుకుంది రకుల్. అందుకే బాగా ఎగ్జయిట్ అవుతోంది. మెగాస్టార్ తో కలిసి నటించాననే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతోంది.

"బ్రూస్ లీలో చేయడంతో నా కల తీరినట్లైంది. నేను ఎదురుచూస్తున్న పర్ ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టెయినర్ ఇది. ఆన్ స్క్రీనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ రామ్ చరణ్ సూపర్బ్. ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉండడానికి చెర్రీ వ్యక్తిత్వం కూడా కారణమే" అంటోది రకుల్.

చిరు ఫ్యామిలీ కలిసి లే చలో సాంగ్ ని చూసిందట రకుల్. పాట చూశాక.. "రకుల్, నువ్వు అందం అనే పదం కంటే అద్భుతంగా ఉన్నావ్" అని కాంప్లిమెంట్ ఇచ్చారంటూ మురిసిపోతోంది రకుల్. ఈ కామెంట్ తో ఒక్కసారిగా చుక్కలను తాకిన ఫీలింగ్ వచ్చేసిందని అంటోంది. అంతే కాదు.. మెగాస్టార్ తో షూటింగ్ గురించిన ముచ్చట్లు కూడా పంచుకుందీ 24 ఏళ్ల పంజాబీ పాప.

"నాకు ఓ రోజు ఉదయాన్ని తొమ్మిదింటికి చిరు సార్ తో షూటింగ్ ఉంది. మేమందరం సెట్స్ కి వచ్చాం. ఆయన 8.59కల్లా వచ్చి మానిటర్ ముందు కూర్చున్నారు. మెగాస్టార్ టైమింగ్ చూసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆయన సినిమాలను ప్రేమిస్తారు. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుని నేర్చుకుంటారు. ఇతరులను ఎంతో గౌరవిస్తారు. అందుకే ఆయన చిరంజీవి అయ్యారు" అంటూ.. మెగాస్టార్ ని తిరిగి పొగడ్తల్లో ముంచేసింది రకుల్ ప్రీత్ సింగ్.