Begin typing your search above and press return to search.

ప‌సుపు ప‌చ్చ కోక‌లో పెళ్లికూతురెవ‌రు?

By:  Tupaki Desk   |   19 Sep 2019 9:07 AM GMT
ప‌సుపు ప‌చ్చ కోక‌లో పెళ్లికూతురెవ‌రు?
X
పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ లో ర‌క‌ర‌కాల కోణాల్ని త‌ర‌చి చూస్తే న‌వ‌త‌రానికి ఇంత‌కుమించిన బెస్ట్ స్ఫూర్తి ఇంకొక‌రు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న‌ది మొద‌లు ఇటీవ‌ల వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో అవ‌కాశాలు అందుకుని అగ్ర నాయిక కిరీటం ద‌క్కించుకుంది. స‌రిగ్గా ఇలాంటి టైమ్ లోనే తెలివిగా ఆలోచించిన ర‌కుల్ ఫిట్ నెస్ బిజినెస్ లో ప్ర‌వేశించి ఎఫ్ 45 జిమ్ముల చైన్ ని ప్రారంభించింది.

అదంతా త‌న‌లో ఒక కోణం. అయితే రెండో కోణంలో చూస్తే.. ర‌కుల్ గొప్ప ఫ్యాషనిస్టాగా వెలిగిపోతూ స‌మ‌కాలీన క‌థానాయిక‌ల్లో తిరుగులేని ఐక‌న్ గానూ వెలిగిపోతోంది. ఐదున్న‌ర అడుగుల బుల్లెట్టులా ర‌కుల్ ఏ డ్రెస్ తొడిగినా ఆ డ్రెస్ కే అందం వ‌చ్చేస్తోంది.

నిన్న‌గాక మొన్న ఐఫా 2019 వేడుక‌ల్లో 24 క్యారెట్ బంగారం బిస్కెట్ లా త‌ళ‌త‌ళా మెరిసిపోయింది. బంగారు వ‌ర్ణం డిజైన‌ర్ సూట్ లో ర‌కుల నెవ్వ‌ర్ బిఫోర్ అన్నంత‌గా మెరుపులు మెరిపించింది. ఈ ఈవెంట్ కే ర‌కుల్ డ్రెస్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిన్న గ్రీన్ కార్పెట్ పై సొగసు ఆర‌బోసింది. ఇంత‌లోనే ఇదిగో ఇలా బ్రైడ్స్ టుడే మ్యాగ‌జైన్ ఫోటోషూట్ అంటూ శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబోలో వాలిపోయింది. అక్క‌డ ఓల్డ్ డ‌చ్ హాస్పిట‌ల్ లో ఈ అమ్మ‌డి ఫోటోషూట్ చేస్తున్నార‌ట‌. ప‌సుపు ప‌చ్చ చీర‌లో పెళ్లి కూతురులా ముస్తాబు అయ్యింది. ఈ ఒక్క‌టేనా అంటే ఇందులో త‌ళాంగుత‌ళుకులు మునుముందు ఒక్కొక్క‌టిగా వ‌దులుతుందేమో సోష‌ల్ మీడియాలో. జస్ట్ వెయిట్...