Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: 24 క్యారెట్ బంగారం బిస్కెట్
By: Tupaki Desk | 17 Sep 2019 2:30 PM GMTఅందాల రకుల్ ప్రీత్ ప్రస్తుతం ఓవైపు సినీకెరీర్ ని చక్కదిద్దుకుంటూనే మరోవైపు సరికొత్త వ్యాపార మార్గాల్ని అన్వేషిస్తూ ఎంటర్ ప్రెన్యూర్ గా దూసుకుపోతోంది. హైదరాబాద్- వైజాగ్ లాంటి చోట్ల జిమ్ బిజినెస్ కి ఉన్న క్రేజును దృష్టిలో పెట్టుకుని ఎఫ్ 45 పేరుతో జిమ్ములు నిర్వహిస్తోంది. నిరంతరం వీటికి రకుల్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోంది. అలాగే టెన్నిస్ వంటి క్రీడల్లోనూ రకుల్ భాగస్వాములతో కలిసి పెట్టుబడులు పెడుతోంది.
దీపం ఉండగానే ఈ అమ్మడి దిద్దుబాటు అందరినీ ఆకర్షిస్తోంది. మరోవైపు ముంబై పరిశ్రమలోనూ తన హవా చాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తాప్సీ బాటలోనే అక్కడ వెలిగిపోవాలని ఈ అమ్మడు చాలానే కలలుగంటోందట. అందుకే ప్రతిసారీ ముంబై ర్యాంపుపై తనకు దొరికిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టకుండా ప్రయత్నాలు సాగిస్తోంది.
తాజాగా ఐఫా అవార్డ్స్ వేడుకల్లో రెడ్ కార్పెట్ పై ఈ అమ్మడు తళతళా మెరిసింది. రకుల్ పూర్తిగా బంగారు వర్ణం డిజైనర్ డ్రెస్ లో తళుకుబెళుకులు ప్రదర్శించింది. ఒక రకంగా 24 క్యారెట్ బంగారం బిస్కెట్ లా మెరిసిపోయిందంటే అతిశయోక్తి కాదు. రకుల్ గోల్డెన్ సూట్ లుక్ ఇప్పటికే అభిమానుల్లో వైరల్ గా మారింది. టాప్ టు బాటమ్ గోల్డ్ అప్పియరెన్స్ మతి చెడగొడుతోంది. ఓవైపు బంగారం ధరలు చుక్కల్ని తాకి నెమ్మదిగా దిగొస్తున్నాయని టాక్. ఇలాంటి వేళ ఇలా బంగారంలా ఊరిస్తోంది చక్కనమ్మ.