Begin typing your search above and press return to search.

పాపం రకుల్‌ అనే వారికి పెద్ద షాక్‌ ఇచ్చింది!

By:  Tupaki Desk   |   18 Nov 2018 12:55 PM GMT
పాపం రకుల్‌ అనే వారికి పెద్ద షాక్‌ ఇచ్చింది!
X
గత సంవత్సరం - అంతకు ముందు సంవత్సరం టాలీవుడ్‌ లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా వరుసగా స్టార్‌ హీరోల సినిమాలో నటించింది. మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరోకు కూడా ఒకానొక సమయంలో డేట్లు లేవని చెప్పింది. మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరోకు డేట్లు లేవని చెప్పడం చాలా బాధ కలిగించిందని రకుల్‌ ఒక సందర్బంలో చెప్పుకొచ్చింది. మళ్లీ మహేష్‌ తదుపరి చిత్రంలో ఆఫర్‌ ఇచ్చాడు. అలా టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోలందరితో కూడా కలిసి నటించిన రకుల్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ లో పెద్దగా సినిమాలు చేయడం లేదు.

రకుల్‌ తెలుగులో సినిమాలు చేయకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పాపం రకుల్‌ కు ఆఫర్లు లేవు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో గత సంవత్సరం వరకు చాలా బిజీగా గడిపిన రకుల్‌ ఇప్పుడు ఒక్కసారిగా ఆఫర్లు లేకుండా పోవడం అభిమానులు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో కూడా రకుల్‌ క్రేజ్‌ తగ్గింది - సినిమాల్లో ఆఫర్లు రావడం లేదు అంటూ కథనాలు వచ్చాయి. తాజాగా ఆ కథనాలపై రకుల్‌ వింతగా స్పందించింది.

తన పట్ల సానుభూతి తెలుపుతూ - ఆఫర్లు లేవు అంటూ కథనాలు రాస్తున్న వారికి రకుల్‌ షాక్‌ ఇచ్చింది. తనకు ఆఫర్లు లేకపోవడం ఏంటండి - ప్రస్తుతం నేను వేరే భాషల్లో ఏడు సినిమాలు చేస్తున్నాను. నేను 365 రోజులు బిజీగానే ఉంటున్నాను. నాకు సినిమాలు లేవు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. తెలుగులో అనుకోకుండా గ్యాప్‌ వచ్చింది. తెలుగు నుండి కూడా ఆఫర్లు వస్తున్నా కూడా బిజీ షెడ్యూల్‌ కారణంగా వాటిని ఒప్పుకునే పరిస్థితి లేదు అంటూ గొప్పలు చెబుతోంది. రకుల్‌ మాటల్లో కాస్త నిజం ఉన్నా కూడా 365 డేస్‌ బిజీ మాత్రం కాదు. చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇతర భాషల్లో కెరీర్‌ ను నెట్టుకు వస్తుందనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి.