Begin typing your search above and press return to search.

బ్రూస్ లీ బ్యూటీ ఏదీ దాచుకోదట

By:  Tupaki Desk   |   27 Oct 2016 5:33 AM GMT
బ్రూస్ లీ బ్యూటీ ఏదీ దాచుకోదట
X
ఫిలిం ఇండస్ట్రీలో ట్రాన్స్ పరెన్సీ అనే మాట చాలా కష్టం. కెరీర్ కొత్తల్లో కాస్త ప్రయత్నించినా.. స్టార్ డం పెరిగే కొద్దీ ఓపెన్ గా ఉండడం కష్టమైపోతూ ఉంటుంది. కానీ ఈ రేంజ్ కి వచ్చినా సరే.. తను ఇంకా ఏం దాచుకోలేకపోతున్నానని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రతీ చిన్న విషయాన్నీ బయటపెట్టేయకపోతే తనకు మనసు కుదురుగా ఉండదని అంటోంది.

'ఏ విషయాన్నీ దాచుకోవడం నాకు అస్సలు నచ్చదు. చిన్నప్పటి నుంచి అదే. ఏ చిన్న సంగతి తెలిసినా ఎవరో ఒకరితో పంచుకునే వరకూ నిద్రపోను. పోనీ దాచుకుందామని ప్రయత్నిస్తే.. నాకు తెలీకుండానే మాటల్లో బయటకొచ్చేస్తుంది. మాటల్లో చెప్పకపోతే.. నా ఫేస్ ఫీలింగ్స్ తో అయినా ఆ సంగతి తెలిసిపోతుంది. అందుకే నా కంటే నా చుట్టూ ఉన్న వాళ్లకే నా గురించి ఎక్కువ తెలుస్తుంది' అంటోంది బ్రూస్ లీ అండ్ ధృవ చిత్రాల్లో మెగా పవర్ స్టార్ హీరోయిన్.

చాలామంది ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పమని అడుగుతూ ఉంటారట. కానీ నా లైఫ్ లో ఒక్క సీక్రెట్ కూడా లేదు.. ఎలా చెప్పను అంటూ నవ్వేస్తోంది రకుల్. అమ్మడు చెప్పిన సంగతులు బాగానే ఉన్నాయ్ కానీ.. మరీ అన్ని గుట్టుమట్లు ఎప్పటికప్పుడు విప్పేస్తే ఎలా రకుల్? కాసిన్ని దాచుకో.. అంటూ సలహాలు వినిపిస్తున్నాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/