Begin typing your search above and press return to search.

రకుల్ కు ఛాన్సొచ్చింది.. కాని..

By:  Tupaki Desk   |   16 Jan 2018 7:34 AM GMT
రకుల్ కు ఛాన్సొచ్చింది.. కాని..
X
కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాకే స్టార్ హీరోయిన్లు అయిపోతారు. ఆర్తి అగర్వాల్ - సమంత - సాయిపల్లవి.. ఆ క్యాటగిరీ అనమాట. కొంతమంది మాత్రం కష్టపడి కొన్ని సినిమాలు చేస్తూ వచ్చి.. మధ్యలో ఒక్క సినిమాతో బ్రేక్ తెచ్చుకుని.. నిధానంగా స్టార్ హీరోయిన్లు అవుతారు. అప్పట్లో సిమ్రాన్.. ఆ తరువాత ఇప్పుడు రకుల్.. అలాంటి కోవకే చెందుతారు. అయితే గ్లామర్ కే పర్యాయపదంగా పేరుపొందిన ఇటువంటి స్టారీమణులు.. సడన్ గా గ్లామర్ వద్దు అనగానే అవకాశాలు కూడా సన్నగిల్లిపోతాయ్.

చూస్తుంటే ఇప్పుడు రకుల్ ప్రీత్ పరిస్థితి అదే తరహాలో ఉందని అనిపిస్తోంది. తెలుగులో ప్రస్తుతం అమ్మడు ఇంకా ఏ సినిమా సైన్ చేయలేదు. ఉండడానికి మూడు నాలుగు అవకాశాలు ఉన్నాకూడా.. అమ్మడు ఏది సైన్ చేయలేదు. టాలీవుడ్లో అందరూ గ్లామర్ పాత్రలే ఇస్తున్నారని కాబోలు.. అమ్మడు హిందీవైపు చూస్తోంది. ఆల్రెడీ ఫిబ్రవరి 9న ఈమె నటించిన అయ్యారి సినిమా రిలీజ్ అవుతుండగా.. ఇప్పుడు అజయ్ దేవగన్ సరసన తనకు తదుపరి సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్సొచ్చిందని ప్రకటించింది రకుల్. లవ్ రంజన్ అనే దర్శకుడు తీస్తున్న సినిమాలో.. అజయ్ అండ్ టబు మెయిన్ లీడ్లో నటిస్తుంటే.. రకుల్ మరో ముఖ్యమైన పాత్రను చేస్తోందట.

నిజానికి సౌత్ లో స్టార్లు అయిన హీరోయిన్లు అందరూ.. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ మరియు అక్షయ్ కుమార్ లతో సినిమాలు చేసినవారే. కాజల్ అండ్ ఇలియానా.. తమన్నా అందుకు ఎగ్జాంపుల్స్. త్రిష కూడా ఒక సినిమా చేసింది. అయితే వీరిలో ముగ్గురు హిందీ మాతృబాషగా కలిగిన హీరోయిన్లే అయినప్పటికీ.. ఆ సినిమాలు ఆడినప్పటికీ.. వీరికి మాత్రం బ్రేక్ రాలేదు. మరి రకుల్ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.